Kavitha Comments: పెద్దల ఆస్తులను వదిలి, పేదల ఇళ్లను కూల్చేస్తున్నారు
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:11 AM
హైడ్రా అధికారులు పెద్దల ఆస్తులను వదిలి పేదల ఇళ్లపై మాత్రమే దాడి చేయడం దారుణమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. శని, ఆదివారాల్లో కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఇళ్లను కూల్చడం అమానుషమన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) గాజుల రామారంలో హైడ్రా కూల్చిన ఇళ్లను పరిశీలించారు. ఈ భూములు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించారు. అప్పట్లో ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకుంటే కబ్జాలు జరిగేవి కావు. కానీ ఇప్పుడు 260 ఎకరాల భూమి, పక్కనున్న భూమితో కలిపి 400 ఎకరాలు పలుమార్లు కబ్జాకు గురైందన్నారు.
హైడ్రా అకస్మాత్తుగా వచ్చి, పెద్దల ఆస్తులను వదిలి, పేదల ఇళ్లను కూల్చేసిందన్నారు. పండగ సమయంలో కూడా ఈ చర్యలు దారుణమని వ్యాఖ్యానించారు. కోర్టు శని, ఆదివారాల్లో ఇలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంగా చెప్పింది. న్యాయవ్యవస్థను గౌరవించాలి, కానీ ప్రభుత్వం ఆదివారం బస్తీల్లో ఇళ్లను కూల్చింది. పేదలు, వృద్ధులను రోడ్డున పడేశారు.
కరెంటు, గ్యాస్ బిల్లులు చెల్లించే వారిని కూడా విడిచిపెట్టలేదని పేర్కొన్నారు. ఇది పేద ప్రజలపై జరిగిన దాడి అని వ్యాఖ్యానించిన కవిత.. ప్రభుత్వం వెంటనే స్పందించి, ఇండ్లు కోల్పోయిన 200 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి రూ.50,000 పరిహారం ఇవ్వాలని, వచ్చే నెల ఆరో తారీకు లోపల ఇది జరగాలన్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి