DK Aruna: కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కోరుకుపోయింది.. డీకే అరుణ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Feb 02 , 2025 | 08:02 PM
DK Aruna: కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కోరుకుపోయింది ఇది పర్సంటేజీల ప్రభుత్వమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ప్రజలతోపాటు ఎమ్మెల్యేల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్పారు.
మహబూబ్ నగర్ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. జడ్చర్లలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ డీకే అరుణ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు సంతృప్తిగా లేరని అన్నారు. ప్రజలతోపాటు ఎమ్మెల్యేల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు బయట మాట్లాడలేక సమావేశాలు పెట్టుకుని ఇది అవినీతి ప్రభుత్వమని మాట్లాడుకుంటున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కోరుకుపోయింది ఇది పర్సంటేజీల ప్రభుత్వమని ఆరోపించారు. పదిశాతం కమీషన్లు ఇస్తే కానీ ఈ ప్రభుత్వంలో పనులు కావడం లేదని ఆరోపించారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో తెలియదని.. పరిపాలన ఇప్పటివరకు గాడిలోనే పడలేదని విమర్శించారు. తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ కుప్పకూలిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వంలో ఉన్న వారందరూ కుర్చీల వేటలోనే ఉన్నారని డీకే అరుణ ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్టు.. విచారణ చేస్తున్న పోలీసులు..
KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
Fire Accidents: పాతబస్తీ, జీడిమెట్లలో అగ్ని ప్రమాదం..
Read Latest Telangana News and Telugu News