Share News

Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏమైందంటే..

ABN , Publish Date - Dec 20 , 2025 | 12:00 PM

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పీవీ ఎక్స్‌ప్రెస్‌వేలోని పిల్లర్ నంబర్ 253 వద్ద మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏమైందంటే..
Hyderabad Road Accident

రంగారెడ్డి, డిసెంబరు20 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై ఇవాళ(శనివారం) ఘోర రోడ్డు ప్రమాదం (PV Expressway Accident) చోటుచేసుకుంది. పీవీ ఎక్స్‌ప్రెస్‌వేలోని పిల్లర్ నంబర్ 253 వద్ద మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో అక్కడున్న స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద ధాటికి వాహనాలు దెబ్బతినగా, పలువురికి గాయాలయ్యాయి.


సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్సుల ద్వారా సమీప ఆస్పత్రులకు తరలించారు. గాయాల తీవ్రతపై పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు.


ఈ ప్రమాదం కారణంగా పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉప్పర్‌పల్లి నుంచి ఆరంఘర్ చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమంగా క్లియర్ చేస్తూ వాహనాలను మళ్లించేందుకు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీజేపీలోకి సినీనటి ఆమని.. ముహూర్తం ఫిక్స్

రామ్ సుతార్ మృతి శిల్ప కళకు తీరని లోటు: కేసీఆర్

Read Latest Telangana News and National News

Updated Date - Dec 20 , 2025 | 12:09 PM