DCCB: సహకార సంఘాల పదవీ కాలం పొడిగించిన సర్కార్
ABN , Publish Date - Feb 14 , 2025 | 08:52 PM
DCCB: సహకార సంఘాలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డీసీసీబీ చైర్మన్ల పదవి కాలాన్నీ మరో ఆరు నెలలు పొడిగించాలని నిర్ణయించింది.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలక వర్గ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 904 సహకార సంఘాలు కాలపరిమితితోపాటు 9 డీసీసీబీ చైర్మన్ల పదవి కాలాన్నీ మరో ఆరు నెలలు పొడిగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పాలక వర్గ పదవీ కాలానికి 6 నెలల ముందే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతోంది. కానీ ఫిబ్రవరి 15వ తేదీ సమీపానికి వచ్చినా.. ఇంత వరకు రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. దీంతో సహకార సంఘాల కాలపరిమితిని మరో ఆరు నెలలు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మరోవైపు ఫిబ్రవరి 11వ తేదీన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల పదవి కాలం పొడిగించాలంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును డీసీసీబీ చైర్మన్లు కలిసి విజ్జప్తి చేశారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఫిబ్రవరి 15వ తేదీతో తమ పదవి కాలం ముగియనుండగా.. ఇంత వరకు సహకార సంఘాల రిజిస్ట్రార్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
Also Read : విజయవాడలో క్యాట్ సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు.. ముహూర్తం ఖరారు
ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల పాటు తమ పదవీ కాలాన్ని పొడిగించాలంటూ మంత్రిని వారు కోరారు. అయితే ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానని వారికి హామీ ఇచ్చారు. ఇక ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి మంత్రి తుమ్మల తీసుకు వెళ్లారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. దీంతో ఆరు నెలల పాటు పాలక వర్గ గడువును ప్రభుత్వం పొడిగించింది.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రధాని మోదీకి ఎలాన్ మస్క్ గిఫ్ట్
Also Read: అమ్మో.. ర్యాగింగ్ ఇలా కూడా చేస్తారా?.. స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
Also Read : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి
Also Read: వసంత ప్రాణం తీసిన.. ఆ వీడియోలు
Also Read: ఆళ్ల నాని ఎంట్రీ.. ఏలూరు ఎమ్మెల్యే రియాక్షన్
Also Read: బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చురకలు.. ఎందుకంటే..?
For Telangana News And Telugu News