Share News

CAT: విజయవాడలో క్యాట్ సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు.. ముహూర్తం ఖరారు

ABN , Publish Date - Feb 14 , 2025 | 08:16 PM

Central Administrative Tribunal: విజయవాడలో సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (సీఏటీ) చైర్మన్ నిర్ణయించారు. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 11.00 గంటలకు వర్చువల్ విధానంలో ఈ సర్క్యూట్ బెంచ్‌ను ప్రారంభించాలని ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిపారు.

CAT: విజయవాడలో క్యాట్ సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు.. ముహూర్తం ఖరారు

అమరావతి, ఫిబ్రవరి 14: విజయవాడలో సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేయాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (సీఏటీ) నిర్ణయించింది. ఈ మేరకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ శుక్రవారం ప్రకటించారు. హైదరాబాద్ ‌బెంచ్‌కు చెందిన సర్క్యూట్ బెంచ్‌ను విజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 11.00 గంటలకు వర్చువల్ విధానంలో ఈ సర్క్యూట్ బెంచ్‌ను ప్రారంభించాలని ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిపారు.

అయితే ఇప్పటి వరకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కోసం హైదరాబాద్ కేంద్రంగా అఖిల భారత సర్వీసు అధికారులు తరచు వెళ్లేవారు. ఇక విజయవాడలో సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతోన్నాయి. అఖిల భారత స్థాయి అధికారులు.. ప్రభుత్వ బదిలీలు తదితర అంశాలపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తారన్న సంగతి అందరికి తెలిసిందే.

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రధాని మోదీకి ఎలాన్ మస్క్ గిఫ్ట్

Also Read: అమ్మో.. ర్యాగింగ్ ఇలా కూడా చేస్తారా?.. స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ

Also Read : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

Also Read: వసంత ప్రాణం తీసిన.. ఆ వీడియోలు

Also Read: ఆళ్ల నాని ఎంట్రీ.. ఏలూరు ఎమ్మెల్యే రియాక్షన్

Also Read: బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చురకలు.. ఎందుకంటే..?

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 14 , 2025 | 08:18 PM