Vasantha: వసంత ప్రాణం తీసిన.. ఆ వీడియోలు
ABN , Publish Date - Feb 14 , 2025 | 02:50 PM
Vasantha: పోర్న్ వీడియోలు.. ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. పెళ్లయిన కొద్ది రోజులకే నూరేళ్లు నిండిపోయాయి. అందుకు భర్త వ్యవహరించిన తీరే కారణమని వసంత బంధువులు ఆరోపిస్తున్నారు.

విశాఖపట్నం, ఫిబ్రవరి 14: దంపతుల్లో ఎవరో ఒకరి విపరీత మనస్తత్వం మరొకరిపై తీవ్ర ప్రభావం చూపుతొంది. ఆ క్రమంలో వారిలో అలజడి రేగి.. బలవంతపు మరణానికి దారి తీస్తోంది. అందుకు సోషల్ మీడియాతోపాటు సెల్ ఫోన్ సైతం కారణమవుతోంది. విశాఖపట్నం నగరంలోని గోపాలపట్నం పరిధిలో దాదాపు అదే తరహా ఘటన చోటు చేసుకుంది. వసంతకు ఇటీవల వివాహమైంది. పోర్న్ వీడియోల్లో ఉండే విధంగా తనతో వ్యవహరించాలంటూ వసంతను భర్త వేధిస్తుండడం ప్రారంభించారు. ఆ క్రమంలో వైవాహిక జీవితంలో దంపతుల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో వైద్యుల వద్దకు వెళ్లి దంపతులు కౌన్సిలింగ్ సైతం తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో.. వసంత గురువారం అర్థరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా వసంత మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అయితే భర్త వేధింపుల కారణంగానే వసంత ఆత్మహత్య చేసుకుందంటూ ఆమె తరఫు బంధువులు ఆరోపించారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తేనే కానీ ఏం చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. అదీకాక వివాహమై కొద్ది రోజులకే వసంత విగత జీవిగా మారడంతో.. ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతోన్నారు.
మరోవైపు తెలంగాణ కేడర్‌కు చెందిన 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝూపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశించింది. సందీప్ కుమార్‌పై ఆయన భార్యే ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం.. తనను శారీరకంగా హింసిస్తుండమే కాకుండా.. అసహజ శృంగారానికి తనపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఈ నేపథ్యంలో తన సొంత రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కానీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయ లేదు. ఈ నేపథ్యంలో కోర్బాలోని స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను విచారించిన కోర్టు సందీప్‌కుమార్ ఝూపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
For AndhraPradesh News And Telugu News