Share News

Medical College: అమ్మో.. ర్యాగింగ్ ఇలా కూడా చేస్తారా?.. స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ

ABN , Publish Date - Feb 14 , 2025 | 05:45 PM

Medical College: జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడిన ఐదుగురు సీనియర్లను మెడికల్ కాలేజీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం బహిష్కరించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. మరోవైపు జాతీయ మానవ హక్కుల సంఘం సైతం స్పందించింది. ఈ వ్యవహారంపై 10 రోజుల్లో నివేదిక అందజేయాలని పోలీసులను ఆదేశించింది.

Medical College: అమ్మో.. ర్యాగింగ్ ఇలా కూడా చేస్తారా?.. స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: కాలేజీల్లో ర్యాగింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటుంది. అయినా.. దేశంలో ఎక్కడో అక్కడ..ఎప్పుడో అప్పుడు ఏదో ఒక కళాశాలలో ర్యాగింగ్ జరుగుతూనే ఉంది. తాజాగా కేరళలోని కొట్టాయం గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేసిన వీడియో మీడియా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలపై జాతీయ మనవ హక్కుల సంఘం సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరిపి 10 రోజుల్లో నివేదిక అందజేయాలంటూ కేరళ పోలీసులను ఆదేశించింది. మరోవైపు ఈ వ్యవహారంలో ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్ విద్యార్థులు రాహుల్ రాజ్, ఎన్ఎస్ జీవా, ఎన్‌పీ వివేక్, రిగిల్ జీత్, శామ్యుల్ జాన్సన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వీరిని కాలేజీ నుంచి బహిష్కరించామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ వ్యవహారంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Kerala-Ragging.jpg

ఇంతకీ ఏం జరిగిందంటే..

కోట్టాయంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోన్న ఐదుగురు విద్యార్థులు.. మొదటి సంవత్సరం చదువుతోన్న విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ఆ క్రమంలో జూనియర్ విద్యార్థులను మంచాలకు కట్టేసి.. వారిని వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. మరికొన్ని సమయాల్లో జూనియర్ల మెడపై కత్తులతో గాట్లు పెట్టేవారు. అవి గాయాలు కావడంతో.. వాటిపై మంటలు రేపే విధంగా ప్రవర్తించేవారు.


అంతేకాదు.. వారి నుంచి భారీగా నగదు సైతం డిమాండ్ చేసే వారు. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు.. మద్యంతోపాటు బిర్యానీ కొనిపట్టాలంటూ జూనియర్లపై సీనియర్లు తీవ్ర ఒత్తిడి చేసేవారు. ఆ క్రమంలో జూనియర్లను చిత్ర హింసలు పెడుతోన్న వీడియోలు వైరల్ అయినాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జాతీయ మానవ హక్కుల సంఘం సైతం స్పందించింది.

Also Read : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి


ఈ ర్యాగింగ్ ఘటనపై ప్రతిపక్షాలు స్పందించాయి. ర్యాగింగ్ నిందితులకు విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐతో సంబంధాలున్నాయంటూ కాంగ్రెస్, యూడీఎఫ్ పార్టీలు ఆరోపణలు గుప్పించాయి. ఈ ఘటనపై కేరళ ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్ బిందు స్పందించారు. ఈ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడిన నిందితులపై ప్రోహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్‌తోపాటు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read: వసంత ప్రాణం తీసిన.. ఆ వీడియోలు

Also Read: ఆళ్ల నాని ఎంట్రీ.. ఏలూరు ఎమ్మెల్యే రియాక్షన్

Also Read: బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చురకలు.. ఎందుకంటే..?

For National News and Telugu News

Updated Date - Feb 14 , 2025 | 06:21 PM