PM US Tour: ప్రధాని మోదీకి ఎలాన్ మస్క్ గిఫ్ట్
ABN , Publish Date - Feb 14 , 2025 | 06:58 PM
PM US Tour: యూఎస్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీతో తన కుటుంబ సభ్యులతో కలిసి ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ పిల్లులకు భారత్‌లో క్లాసిక్స్‌గా ఖ్యాతి పొందిన పలు పుస్తకాలను ప్రధాని మోదీ బహుమతులుగా అందజేశారు.

వాషింగ్టన్, ఫిబ్రవరి 14: అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ప్రముఖలతో సమావేశమవుతోన్నారు. అందులోభాగంగా వాషింగ్టన్‌లోని బ్లెయిర్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో టెస్లా, స్పెస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఎలాన్ మస్క్ ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చారు. హెక్సాగ్నల్ సిరామిక్ హీట్ షీల్డ్ టైల్స్‌ను ప్రధాని మోదీకి ఎలాన్ మస్క్ అందజేశారు. దీనిపై 2024 అక్టోబర్ 13, స్టార్‌షిప్ ఫ్లైట్ టెస్ట్ 5 అని అక్షరాలు ముద్రితమై ఉన్నాయి.
ఈ సమావేశానికి ఎలాన్ మస్క్ తన భాగస్వామి షివోన్ జిలిస్ తోపాటు తన ముగ్గురు పిల్లల కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ పిల్లలకు సైతం ప్రధాని మోదీ బహుమతిగా నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ది క్రిసెంట్ మూన్, ఆర్కే నారాయణ్ రచించిన పుస్తకాలతోపాటు విష్ణు శర్మ రచించిన పంచతంత్రం పుస్తకాలు అందజేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని నరేంద్ర మోదీ షేర్ చేశారు. అవీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ట్రంప్ ప్రభుత్వంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ వ్యవహారాలను మస్క్ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే ఈ భేటీ అనంతరం ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ స్పందించారు. ఎలాన్ మస్క్‌తో సమావేశం మంచిగా జరిగిందన్నారు. ఈ సమావేశంలో అంతరిక్షం, సాంకేతిక, ఆవిష్కరణ తదితర అంశాలపై చర్చించామని తెలిపారు. సంస్కరణల దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాలు, కనీస ప్రభుత్వం - గరిష్ట పాలనతోపాటు వివిధ అంశాలపై మస్క్‌తో తాను మాట్లాడినట్లు ప్రధాని మోదీ తన పోస్ట్‌లో వివరించారు.
Also Read: అమ్మో.. ర్యాగింగ్ ఇలా కూడా చేస్తారా?.. స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
అలాగే మిస్టర్ ఎలాన్ మస్క్ కుటుంబాన్ని కలవడం తోపాటు విస్తృతమైన పలు అంశాలపై మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక గతంలో అంటే 2015లో యూఎస్ పర్యటనకు తాను వచ్చిన సమయంలో ఎలాన్ మస్క్‌తో జరిగిన భేటీని సైతం ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఉంటంకించారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి
Also Read: వసంత ప్రాణం తీసిన.. ఆ వీడియోలు
Also Read: ఆళ్ల నాని ఎంట్రీ.. ఏలూరు ఎమ్మెల్యే రియాక్షన్
Also Read: బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చురకలు.. ఎందుకంటే..?
For National News and Telugu News