Minister Konda Surekha: అధికార కాంగ్రెస్ పార్టీలో బీసీ వర్సెస్ రెడ్డి వివాదం..!
ABN , Publish Date - Oct 16 , 2025 | 09:16 AM
అయితే ఇప్పటికే తన ఇంటికి పోలీసులు రావడంపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ మహిళ మంత్రి ఇంటికి పోలీసులను పంపి అవమానించారని ఆమె మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. అధికారి పార్టీలో అంతర్గత విభేదాలు బహిరంగంగా చర్చకు రావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో మంత్రులు కొండా సురేఖ వర్సెస్ పొగులేటి వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ(గురువారం) నిర్వహించబోయే కేబినెట్ సమావేశంపై ఆసక్తి నెలకొంది. కాగా, నేటి కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది.
అయితే ఇప్పటికే తన ఇంటికి పోలీసులు రావడంపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ మహిళ మంత్రి ఇంటికి పోలీసులను పంపి అవమానించారని ఆమె మండిపడ్డారు. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు జరుగుతున్నాయని కొండా సురేఖ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుటి వరకు రాజకీయంగా కొనసాగిన కొండా వివాదం.. మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలతో.. కులాల మలుపు తీసుకుంది.
దీంతో ఈ వివాదం బీసీ వర్సెస్ రెడ్డిగా మారిందని రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలో రెడ్ల రాజ్యం నడుస్తోందని కొండా సుష్మిత సంచలన ఆరోపణలు చేశారు. బీసీలను టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీసీ నేతలను అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి నేతలంతా తమ మీద కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డిలు ఒక్కటై తమపై కుట్రలు చేస్తున్నారని కొండా సుష్మిత ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
Transgenders Hospitalized in Delhi: ఫినాయిల్ తాగిన 25 మంది ట్రాన్స్‌జెండర్లు
The Central Government Informed: రక్షణ భూముల స్వాధీనానికి మార్గదర్శకాలు ఇవ్వండి