TG Govt: బర్డ్ ఫ్లూ దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్
ABN , Publish Date - Feb 14 , 2025 | 10:28 AM
TG Govt: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. అంతటా ఫారాల్లో పెంచుతున్న కోళ్లు బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో మరణిస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో వేలాది కోళ్లు చనిపోయాయి.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్‌తో ప్రజలు భయపడిపోతున్నారు. కొన్నివారాలుగా చాలా ప్రాంతాల్లోని ఫారాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపిస్తోండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవాళ(శుక్రవారం) తనిఖీలు చేపట్టారు. నాణ్యతగా లేని చికెన్ అమ్మకాలు చేస్తున్న వ్యాపారులపై కొరడా ఝుళిపించారు.. పలుమార్లు హెచ్చరించినప్పటికీ వ్యాపారుల ధోరణి మారకపోవడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విసృత్త తనిఖీలు చేపట్టారు.
500 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్..
రసూల్‌పురలోని అన్నానగర్‌లో చికెన్ షాపుల్లో అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలు చికెన్ షాపుల్లో కుళ్లిన చికెన్ భారీగా బయటపడింది. సుమారుగా 500 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్‌ను అధికారులు సీజ్ చేశారు. కుళ్లిన చికెన్ భారీగా బయటపడటం చూసి షాకుకు గురయ్యారు. ఇది వివిధ సెంటర్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కనుక్కోన్నారు. వైన్ షాపులు, బార్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తక్కువ ధరలకు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. మూడు నెలల పాటు కెమికల్స్ కలిపి కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉంచుతున్నట్లు వెల్లడించారు. చికెన్ పాడవకుండా ప్రమాదకరమైన ఫార్మలిన్ కలుపుతున్నట్లు నిర్ధారించారు. బర్డ్ ఫ్లూ వైరస్ కంటే ప్రమాదకరమైన కెమికల్స్ కలుస్తున్నాయంటూ అధికారులు గుర్తించారు. గతంలో ఇదే షాపుల్లో భారీగా కుళ్లిన చికెన్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టికున్నారు. చికెన్ షాపుల లైసెన్సు రద్దు చేశారు. వ్యాపారులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేశారు. కుళ్లిన చికెన్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.
శాంపిళ్ల సేకరణ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. ఫారాల్లో పెంచుతున్న కోళ్లు బర్డ్ ఫ్లూతో భారీ సంఖ్యలో మరణిస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో వేలాది కోళ్లు చనిపోయాయి. మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కూడా బర్డ్ ప్లూ కేసులు బైటపడటంతో.. చనిపోయిన కోళ్లనుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేశారు. పెరవలి మండలం కానూరు గ్రామంలో తీసుకున్న కోళ్ల శాంపిళ్లలో బర్డ్ ప్లూ పాజిటివ్ గా నిర్దారణ అవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
బర్డ్ ప్లూ వ్యాప్తి చెందుతుందంటే..
బర్డ్ ప్లూ వైరస్ సహజంగా జంతువులు, పక్షుల నుంచి మనుషులకు సోకుతుంది. అధికంగా కోళ్ల నుంచి వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి బర్డ్ ప్లూ బారినపడ్డ జంతువులు, పక్షులకు దగ్గరగా ఎక్కువసేపు ఉన్నా కూడా బర్డ్ ప్లూ వస్తుంది. ఈ వ్యాధి సోకిన కోళ్లను తిన్నా మనుషులకు వ్యాపించే అవకాశాలున్నాయి. చికెన్‌ను బాగా శుభ్రం చేసి ఉడికించడం ద్వారా అందులోని వైరస్ చనిపోతుంది. ఉడికీ ఉడకని చికెన్ తినడం వల్ల ఇది మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకే ప్రస్తుతం బర్డ్ ప్లూ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో చికెన్ తినకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రమాణాలు పాటించకుండా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఆహార పదార్థాలు!
సంజయ్, కిషన్‌రెడ్డి.. కోతల రాయుళ్లు
ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్ ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలి
Mini Jatara.. మేడారంలో కొనసాగుతున్న మినీజాతర
Read Latest Telangana News and National News