Share News

Telangana CM Relief Fund Scam: సీఎం రిలీఫ్ ఫండ్‌లో మోసం.. భారీ స్కామ్ వెలుగులోకి..

ABN , Publish Date - Sep 19 , 2025 | 09:15 PM

తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్‌కు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్‌లో అక్రమంగా రూ. 8.71 లక్షలు దోచుకున్న కేసులో ఏడుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Telangana CM Relief Fund Scam: సీఎం రిలీఫ్ ఫండ్‌లో మోసం.. భారీ స్కామ్ వెలుగులోకి..
Telangana CM Relief Fund scam

హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్‌ (Telangana CM Relief Fund scam) కు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్‌లో అక్రమంగా రూ. 8.71 లక్షలు దోచుకున్న కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. నిందితులు పొట్ల రవి, జంగమ నాగరాజు, మటేటి భాస్కర్, ధర్మారం రాజు, కాంపల్లి సంతోష్, చిట్యాల లక్ష్మి, అసంపెల్లి లక్ష్మీలు అరెస్ట్ చేసిన వారిలో ఉన్నారు. నకిలీ లబ్ధిదారులుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తమ ఖాతాల్లో జమ చేసుకుని డబ్బులు విత్‌డ్రా చేశారు నిందితులు.


నిజమైన బాధితులను మోసం చేసిన నిందితులపై IPC 409, 417, 419, 467, 120(B) సెక్షన్లు, IT Act 66(C) కిందా జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితులు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ కేసులో జులై 15వ తేదీన ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు వారిలో జోగుల నరేష్ కుమార్ (Jogula Naresh Kumar), బాలగోని వెంకటేశ్ (Balagoni Venkatesh), కోర్లపాటి వంశీ (Korlapati Vamshi), పులిపాక ఓం కార్(Pulipaka Omkar) ఉన్నారు.


మాజీ మంత్రి కార్యాలయంలో పనిచేసిన నిందితుడు సీఎం ఆఫీస్ చెక్కులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు జూబ్లీహిల్స్ పోలీసులు. 2023 ఎన్నికల తర్వాత 230 చెక్కులను అక్రమంగా తీసుకొని, 19 చెక్కులను నకిలీ లబ్ధిదారుల పేర్లతో వారి ఖాతాల్లో జమ చేసినట్లు గుర్తించారు. ఇప్పటివరకు మొత్తంగా 8.71 లక్షలు అక్రమంగా విత్‌డ్రా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంకా మిగతా నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది. తప్పించుకుని పారిపోయిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్రమాదం.. ఏమైందంటే..

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి: సీఎం రేవంత్‌రెడ్డి

For More Telangana News And Telugu News

Updated Date - Sep 19 , 2025 | 09:40 PM