Share News

Minister Ponnam Prabhakar: బీఆర్ఎస్, బీజేపీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం..

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:32 AM

హైదరాబాద్‌కు చెందిన ఐపీఎస్ అధికారి పూరణ్ ఉన్నత అధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం బాధకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని ఆరోపించారు.

Minister Ponnam Prabhakar: బీఆర్ఎస్, బీజేపీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం..
Minister Ponnam Prabhakar

సిద్దిపేట: హుస్నాబాద్ తిరుమల గార్డెన్‌లో బ్లాక్ కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతి రాథోలే, రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు..


హైదరాబాద్‌కు చెందిన ఐపీఎస్ అధికారి పూరణ్ ఉన్నత అధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం బాధకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్లు గల్లంతు చేసే సన్నాహానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.


ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు బీఆర్ఎస్ అభ్యర్థి సునీతను ఎన్నికల ప్రచారంలో కన్నీరు కార్పిస్తూ.. ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. రాజకీయ వేదికలపై ఏడుపులు ఏడవడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కేటీఆర్, హరీష్ రావులు తమ రాజకీయాల కోసం సునీతను ఇబ్బంది పెడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.


ఇవి కూడా చదవండి:

The Supreme Court has directed: ఇందిరా టెలివిజన్‌ కేసులో కౌంటర్‌ వేయండి

Data Center : అమెరికా బయట భారీ పెట్టుబడి రామ్మోహన్‌

Updated Date - Oct 15 , 2025 | 11:34 AM