Share News

PM Modi: రేవంత్‌కు మోదీ అర్జెంట్ కాల్.. ఎందుకంటే..

ABN , Publish Date - Feb 22 , 2025 | 07:21 PM

PM Modi Call: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యవసరంగా ఫోన్ చేశారు. ఈరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

PM Modi: రేవంత్‌కు మోదీ అర్జెంట్ కాల్.. ఎందుకంటే..
PM Modi Call

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ(శనివారం) ఫోన్ చేశారు. నాగర్​ కర్నూల్​ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ తెలిపారు. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్​ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ వివరించారు. సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ టీంను పంపిస్తామని సీఎంకు ప్రధాని మోదీ చెప్పారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.


ప్రమాదం ఏలా జరిగిందంటే..

కాగా.. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌ దగ్గర ఈరోజు భారీ ప్రమాదం జరిగింది. దోమలపెంట దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్‌ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పనులను ప్రారంభించింది. నాలుగు రోజుల క్రితం ఈ పనులు మొదలయ్యాయి. ఇవాళ(శనివారం) ఉదయం సమయంలో పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. టన్నెల్‌ పైభాగంలో మూడు మీటర్ల మేర పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అధికారులు ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎడమగట్టు కాలువ టన్నెల్‌ ద్వారా నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

KTR: రేవంత్ యాక్సిడెంటల్ సీఎం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

Boy Death: మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న చిన్నారి మృతి

Hyderabad: స్వచ్ఛమైన గాలి.. అరగంటకు రూ.5 వేలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 22 , 2025 | 09:44 PM