Share News

Kavitha Meet KCR: కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు ఎమ్మెల్సీ కవిత..

ABN , Publish Date - Aug 14 , 2025 | 10:10 PM

కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ లీక్ తర్వాత కవితను కేసీఆర్, కేటీఆర్‌లు దూరం పెట్టారన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ సమయంలో ఫాంహౌస్‌కు కవిత వెళ్లింది.

Kavitha Meet KCR: కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు ఎమ్మెల్సీ కవిత..
MLC Kalvakuntla Kavitha

హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్సీ కవిత శుక్రవారం కలువనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌‌కు కవిత చేరుకోనున్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం కవిత చిన్న కుమారుడు ఆర్య అమెరికాకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ దంపతుల ఆశీర్వాదం కోసం ఫాంహౌస్‌కు కవిత కుటుంబ సభ్యులు వెళ్లనున్నారు.


అయితే.. కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ లీక్ తర్వాత కవితను కేసీఆర్, కేటీఆర్‌లు దూరం పెట్టారన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ సమయంలో ఫాంహౌస్‌కు కవిత వెళ్లింది. అనంతరం వారితో ఎలాంటి సంప్రదింపులు జరగపలేదు. అదే సమయంలో జాగృతి యాక్టివిటీ స్పీడ్ పెంచింది కవిత. ఈ నేపథ్యంలో కేసీఆర్‌తో కవిత కుటుంబ సభ్యుల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

Updated Date - Aug 14 , 2025 | 10:11 PM