TG DGP: పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:46 PM
పోలీస్ శాఖలో ఉద్యోగుల విద్యార్హతపై తెలంగాణ డీజీపీ జితేందర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులోభాగంగా ఆయన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
హైదరాబాద్, ఆగస్టు 14: దేశంలోనే తొలిసారిగా తెలంగాణా పోలీస్ డిపోర్ట్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్న వారందరికీ గ్రాడ్యుయేషన్ ఉండాలని నిర్ణయించామని డీజీపీ జితేందర్ తెలిపారు. అందులోభాగంగా గురువారం హైదరాబాద్‌లో తెలంగాణా పోలీస్, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల మధ్య ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. పొలీస్ డిపోర్ట్‌మెంట్‌లో 10వ తరగతి, ఇంటర్ చదివి గతంలో ఈ పోలీస్ శాఖలో చేరారని గుర్తు చేశారు.
అయితే వారికి గ్రాడ్యుయేషన్ కల్పించాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుందన్నారు. వాని గ్రాడ్యుయేషన్ చేయించాలనే ఉద్దేశంతో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించారు. డిపార్ట్‌మెంట్‌లో దాదాపు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్.. 30 వేల మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేయని వారు ఉన్నట్లు తాము గుర్తించామని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అందరూ గ్రాడ్యుయేషన్ చేసిన వారిగా ఉండాలని తమ సంకల్పమని ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు.
ఇక అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ గంటా చక్రపాణి మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలకంటే.. మనం అన్ని రకాలుగా ఉత్తమ స్థానంలో ఉన్నామన్నారు. డీజీపీ జితేంద్రకి వచ్చిన అలోచనే ఇప్పుడు కార్యరూపం దాల్చిందని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ప్రస్తుతం వివిధ విభాగాల్లో, పలు పోస్టుల్లో పని చేస్తున్న వారిలో కొందరికి డిగ్రీ అర్హత లేదని తెలిపారు. పలు కారణాలతో డిగ్రీ చేయకపోవడం లేదా డిగ్రీ మధ్యలోనే ఆపేసిన వాళ్లు సైతం ఉన్నారని వివరించారు.
అలాంటి వారికి మా యూనివర్సిటీ ద్వారా ఓపెన్ డిగ్రీ చేసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. అంతేకాకుండా.. వీళ్లకు అదనంగా పోలీసింగ్‌కి కావాల్సిన శిక్షణ సైతం అందిస్తామని తెలిపారు. ఒక వైపు విధులు నిర్వహిస్తూనే.. మరోవైపు చదువుకునే వెసులుబాటు కల్పించనున్నామని తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని ట్రైనింగ్ సెంటర్లను తాము ఈ అభ్యర్థుల కోసం వినియోగించుకోనున్నామని వీసీ ఘంటా చక్రపాణి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాగాల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ
Read Latest Telangana News and National News