Share News

Seethakka criticizes BRS and BJP: అఖిలపక్ష సమావేశానికి బీఆర్‌ఎస్, బీజేపీ డుమ్మాపై సీతక్క ఫైర్

ABN , Publish Date - Mar 08 , 2025 | 04:34 PM

Seethakka criticizes BRS and BJP: బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి సీతక్క. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల ఎంపీలు డుమ్మాకొట్టారు. దీనిపై సీతక్క స్పందించారు.

Seethakka criticizes BRS and BJP: అఖిలపక్ష సమావేశానికి బీఆర్‌ఎస్, బీజేపీ డుమ్మాపై సీతక్క ఫైర్
Seethakka criticizes BRS and BJP

హైదరాబాద్, మార్చి 8: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీ ఎంపీలు హాజరుకాకపోవడంపై మంత్రి సీతక్క (Minister Seethakka) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీ టీం అని మరోసారి రుజువైందన్నారు. కేసులు ఉన్నాయి కాబట్టే వారు కేంద్రంపై పోరాటం అంటే సమయానికి ఎగ్గొడతారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. అందుకే అఖిలపక్ష ఎంపీల సమావేశానికి రాలేదన్నారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పదే పదే కోరే బీఆర్ఎస్ ఈరోజు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేంద్రంపైఏ విధంగా పోరాటం చేయాలో ఎందుకు చెప్పలేదని మంత్రి విరుచుకుపడ్డారు.


ఏడాదిలోపే కోటీశ్వరులు అవుతారా?

అలాగే మాజీ మంత్రి హరీష్‌రావుపై (Former Minister Hairsh Rao) కూడా సీతక్క ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో ఎకరానికి కోటి పంట ఎలా పండించారో సక్సస్ ఫార్ములా చెప్పాలన్నారు. ‘ఓడిపోయిన మీ ఇంటి మహిళను మండలికి పంపి అదే మహిళా సాధికారత అన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి పావుల వడ్డీ రుణాలు కూడా ఇవ్వలేదు. మహిళలకు ఫ్రీ బస్సు పెడితే కూడా ఓర్చుకోవడం లేదు. మహిళలను మేము బస్సులకు ఓనర్లను చేస్తున్నాం. హరీష్ రావు నీ కూతురులాగే ఆడబిడ్డలు ఎదగాలని ఆశీర్వదించండి. బీసీ ఉద్యమానికి కూడా తానే చాంపియన్ కావాలని కవిత వచ్చారు.. మేము మహిళలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతాం. ఏడాదిలో 54 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. కానీ గ్రాడ్యుయేట్స్ బీజేపీకి ఎలా ఓటు వేశారో తెలియడం లేదు. ప్రచారంలో మేము వెనుకబడ్డం వల్లనే మేము ఓడిపోయాం’ అని మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు.


బీఆర్‌ఎస్.. మరీ ఇంత దిగజారిపోయిందా: అద్దంకి

addanki-dayakar.jpg

అలాగే ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్‌కు హాజరుకాకపోవడంపై బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై అఖిలపక్షం పెట్టాలని బీజేపీ, బీఆర్‌ఎస్‌లు అన్నాయని.. ఈరోజు ఎంపీల మీటింగ్‌ కూడా అఖిలపక్షం లాంటిదే అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారం కోసం ఎట్లా వ్యవహరించాలని సొల్యూషన్ కోసం ఎంపీల మీటింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని.. దానికి బీజేపీ, బీఆర్‌ఎస్ హాజరుకాలేదన్నారు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం పట్ల బీజేపీకి, బీఆర్ఎస్‌కు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ప్రధాని మోడీ డైరెక్షన్‌లో నడిచే స్థాయికి బీఆర్ఎస్ దిగజారిపోయిందన్నారు. కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర వదిలేసి ఔట్ సోర్సింగ్‌లో అల్లునికి, కొడుకుకి ఇచ్చారన్నారు. రెండు పార్టీల డ్రామాలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. సమావేశాన్ని ఎందుకు బైకాట్ చేశారో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.


బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓట్లు తప్ప ప్రజా సమస్యలు పట్టవని విరుచుకుపడ్డారు. బీజేపీ వేసే డ్రామాను బీఆర్‌ఎస్ కూడా వేస్తోందన్నారు. తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా చర్చకు రావడంతో బీఆర్‌ఎస్, బీజేపీకి మింగుడు పడటం లేదన్నారు. ‘ఒకడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండదని అంటడు. ఇంకొకడు ఎమ్మెల్యేలు ఉండరని అంటడు. రెండు పార్టీల నాయకులు జలసితో రాజకీయ కుట్రలు చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వంలో రావాల్సిన బిల్లుల కోసం కాంట్రాక్టర్లతో ధర్నాలు చేయిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గరకు పాజిటివ్‌గాపోవాలని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని అద్దం దయాకర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

seethakka International Womens Day: మహిళలను ఎదగనిద్దాం... మహిళలను గౌరవిద్దాం.

Chandrababu Naidu: మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా ఏపీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 08 , 2025 | 04:53 PM