seethakka International Womens Day: మహిళలను ఎదగనిద్దాం... మహిళలను గౌరవిద్దాం
ABN , Publish Date - Mar 08 , 2025 | 10:02 AM
seethakka International Womens Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రన్ ఫర్ యాక్షన్ 2025ను మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. మహిళలకు మంచి స్ట్రెంత్ ఇచ్చేలా ఈ రన్ ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలియజేశారు.

హైదరాబాద్, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రన్ ఫర్ యాక్షన్-2025ను నిర్వహించారు. రన్ ఫర్ యాక్షన్ 2025ను మంత్రి సీతక్క (Minister Seethakka) జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి పరుగు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న యువతీ యువకులు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సీపీ సీవీ ఆనంద్, అడినల్ సీపీ విక్రమ్ మాన్, అడిషనల్ సీపీ క్రైమ్స్ విశ్వ ప్రసాద్ సహా ఇతర డీసీపీలు రన్‌లో పాటిస్పేట్ చేశారు. 5కె రన్, 2కె రన్ పోటీల్లో పాల్గొని గెలుపొందిన విజేతలకు బహుమతులు కూడా అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలకు మంచి స్ట్రెంత్ ఇచ్చేలా ఈ రన్ ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలియజేశారు. అలాగే అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ మానసికంగా, శారీరకంగా అందరూ ధృడంగా ఉండాలన్నారు. సమాజంలో మహిళలంటే ఒకప్పుడు చిన్నచూపు ఉండేదని.. సమాన పనికి సమాన వేతనం కావాలని ఒకప్పుడు జరిగిన గాథరింగ్‌తో మొదలైంది ఈ మహిళా దినోత్సవం అని చెప్పారు. సమానత్వం మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. మహిళలకు పుషులకు తేడా ఏమీ లేదని.. అందరూ సమానమే అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామన్నారు. మహిళల భద్రత కోసం పోలీసులు కృషి చేస్తున్నారని తెలిపారు.
Sabitha Indrarreddy illness: ఎమ్మెల్యే సబితకు అనారోగ్యం
ఉద్యోగ, ఉపాధి, వ్యాపారాల కోసం ఇతర దేశాల నుంచి హైదరాబాద్ వస్తున్నవారు ప్రశాంతంగా ఉంటున్నారంటే కారణం పోలీసులన్నారు. ఎప్పుడూ పోలీసులపైనే ఆధారపడకుండా.... ప్రతి మగవాడు ప్రతి మహిళను తమ ఇంట్లో ఒక ఆడబిడ్డలాగా చూస్తే మహిళలు క్షేమంగా ఇంటికి తిరిగి రాగలుగుతారని చెప్పుకొచ్చారు. ఇటీవలి కాలంలో మత్తు మన జీవితాలను చిత్తు చేస్తోందని.. మన గౌరవాన్ని తగ్గిస్తోందన్నారు. మాదకద్రవ్యాల నుంచి ఈ సమాజాన్ని చైతన్యవంతంగా మార్చాలన్నారు. మహిళల రక్షణకు, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ‘మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. మహిళలను ఎదగనిద్దాం... మహిళలను గౌరవిద్దాం.... మహిళలను ఆత్మ గౌరవంతో తలెత్తుకొని తిరుగనిద్దాం’ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
సీతక్క ఉమెన్ ఆఫ్ స్ట్రగుల్: సీపీ ఆనంద్
‘మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. కింది స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన సీతక్క మన ముఖ్య అతిథి.సీతక్క ఉమెన్ ఆఫ్ స్ట్రగుల్. అందరికీ సీతక్క ఆదర్శం.కమిషనరేట్ పరిధిలో 20 మందిలో డీసీపీల్లో 8 మంది మహిళా డీసీపీలు ఉన్నారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లలో ఇటీవల మహిళా షో(Sho)లను నియమించాం. కమిషనరేట్ లో 18 వేల మంది పోలీసు సిబ్బందిలో 30 శాతం మంది మహిళలే ఉన్నారు. ఇవన్నీ మహిళా ప్రోగ్రెస్‌కు నిదర్శనం’ అని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
నెక్లెస్ రోడ్డులో...
అంతకుముందు నెక్లెస్ రోడ్డులో రన్‌ఫర్ యాక్షన్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెండా ఊపి రన్ ఫర్ యాక్షన్‌ను మంత్రి ప్రారంభించారు. 2కె రన్, 5కె రన్‌లో సుమారు 4 వేల మంది రన్నర్స్ పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్ నుంచిఅమర వీరుల స్తూపం మీదుగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుంచి తిరిగి నెక్లెస్ రోడ్డు వరకు 5కె రన్ జరిగింది. అలాగే నెక్లెస్ రోడ్ నుంచి సెక్రటేరియట్ మీదుగా తిరిగి నెక్లెస్ రోడ్డు వరకు 2కె రన్ సాగింది.
ఇవి కూడా చదవండి...
Gold rates today: నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Chandrababu Naidu: మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా ఏపీ
Read Latest Telangana News And Telugu News