Share News

Minister Ponnam Prabhakar: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు

ABN , Publish Date - Nov 03 , 2025 | 08:12 PM

తెలంగాణ రాష్ట్రంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ... ప్రమాదాలు జరుగకుండా రవాణా శాఖ అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. ఈరోజు జరిగిన చేవెళ్ల ప్రమాదంలో రెండు వాహనాలకు ఫిట్‌నెస్ ఉన్నప్పటికీ ఇరుకు రోడ్డు, డివైడర్ లేకపోవడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ .

Minister Ponnam Prabhakar: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు
Minister Ponnam Prabhakar

హైదరాబాద్, నవంబరు3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో వరుస ప్రమాదాలు (Road Accidents) జరుగుతున్నాయని ... ప్రమాదాలు జరుగకుండా రవాణా శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) దిశానిర్దేశం చేశారు. ఇవాళ(సోమవారం) రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి , జేటీసీలు, డీటీసీలు, ఇతర రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకి మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు జరిగిన చేవెళ్ల ప్రమాదంలో రెండు వాహనాలకు ఫిట్‌నెస్ ఉన్నప్పటికీ ఇరుకు రోడ్డు, డివైడర్ లేకపోవడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. చేవెళ్ల ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని.. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్.


చేవెళ్ల ఘటనలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. వాహనాల స్పీడ్ లాక్ ఎంతవరకు అమలవుతున్నాయో అధికారులు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. వాహనాల స్పీడ్ లాక్ బ్రేక్ చేస్తే ట్రిపుల్ పెనాల్టీ వేయాలని ఆదేశించారు. ఈ విషయంలో రవాణా శాఖ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ సీరియస్‌గా ఉండాలని ఆజ్ఞాపించారు. చేవెళ్ల, తదితర ఘటనలు జరిగినప్పుడు అధికారులు తనిఖీలు చేయడమే కాదని నిరంతరం యాక్షన్ ప్లాన్ ఉండేలా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రవాణా శాఖపై ఉన్న గౌరవాన్ని ప్రజల్లో, ప్రభుత్వంలో పెంపొందించేలా ఉద్యోగులు పని చేయాలని మార్గనిర్దేశం చేశారు. అధికారులు అందరూ జాగ్రత్తగా పని చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్.


రవాణా శాఖ అధికారులు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రతి జిల్లాలో కఠినంగా వ్యవహరిస్తేనే రోడ్డు ప్రమాదాలను అదుపు చేయొచ్చని దిశానిర్దేశం చేశారు. ప్రజలకు వేధింపులు లేకుండా రవాణా శాఖ నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ఆదేశించారు. రవాణా శాఖలో కొత్తగా వచ్చిన ఉద్యోగులతో సీనియర్లు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. టిప్పర్ లారీలు ఇసుక, డస్ట్ తీసుకెళ్లేటప్పుడు టార్పలిన్లు కప్పుకొని తీసుకెళ్లాలని ఆదేశించారు. డీటీసీ, ఆర్టీవోలు ఇతర రవాణా శాఖ అధికారులు ఒక్కో జిల్లాలో మూడు బృందాలుగా ఏర్పాటు చేసుకొని నిరంతరం పర్యవేక్షించాలని మార్గనిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ధ్యానం తరలింపునకు ఉపయోగించే వాహనాలపై వేధింపులకి గురిచేయొద్దని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్.


కమర్షియల్, ప్రయాణికులను తరలించే వాహనాలు, మైన్స్ మినరల్స్ తరలించే వాహనాలు, నిబంధనలు పాటించని వాటిపై భారీ పెనాల్టీతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని ఆజ్ఞాపించారు. నిబంధనలు పాటించని స్లీపర్ బస్సుల్లో కార్గో సరుకులు తరలిస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. స్కూల్ బస్ ఫిట్‌నెస్, హైర్ బస్ ఫిట్‌నెస్, ట్రక్కులు, టిప్పర్లు, లారీలు వాటి ఫిట్‌నెస్, పర్మిట్‌లపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని హుకుం జారీ చేశారు. వచ్చే రోడ్డు సేఫ్టీ మంత్ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని.. దాని కన్నా ముందు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

రాజకీయ దురుద్దేశంతోనే ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పక్కకు పెట్టారు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 03 , 2025 | 10:09 PM