Minister Komatireddy VenkatReddy : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లేదు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 05 , 2025 | 08:10 PM
తెలంగాణలో కక్ష సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీనే లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకుల మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదని పదే పదే చెప్పింది చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు..
ఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న కామెంట్స్‌కు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టడానికి కాళేశ్వరం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుల మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదని పదే పదే చెప్పింది చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో కక్ష సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీనే లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత లిల్లీపుట్ అంటుంది ఆ లిల్లీపుట్ ఎవరో తనకు తెలియదని తెలిపారు. బీఆర్ఎస్‌లో ప్రముఖ నాయకుడు ఆ లిల్లీపుట్‌తో తనపై ఆరోపణలు చేపిస్తున్నారని కవిత బహిరంగంగా చెప్పిందని పేర్కొన్నారు.
మంత్రి పదవులప్పుడు తాను ఒక్కసారి కూడా ఢిల్లీకి రాలేదు, మంత్రి పదవి అడగలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. అయినా అధిష్టానం తనకు మంత్రి పదవి ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి వదులుకున్నానని గుర్తు చేశారు. రాజకీయాల్లో అన్నదమ్ముల సంబంధం అంటు ఏమి ఉండదని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం రేసులో లేనని స్పష్టం చేశారు. హై కమాండ్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానన్నాని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్