Share News

Minister Venkat Reddy On KCR: విలన్లు క్లైమాక్స్‌లోనే అరెస్ట్ అవుతారు.. మంత్రి వెంకట్ రెడ్డి సెటైరికల్‌ కామెంట్స్

ABN , Publish Date - Aug 11 , 2025 | 08:31 PM

జగదీష్ రెడ్డి ఫామ్‌హౌస్ 80 ఎకరాలతో కేసీఆర్ జేజమ్మ లెక్క ఉటుందని మంత్రి వెంకట్ రెడ్డి ఆరోపించారు. జగదీష్ రెడ్డి చేసిన అవనీతిపై విచారణ చేపిస్తున్నామని బాంబు పేల్చారు.

Minister Venkat Reddy On KCR: విలన్లు క్లైమాక్స్‌లోనే అరెస్ట్ అవుతారు.. మంత్రి వెంకట్ రెడ్డి సెటైరికల్‌ కామెంట్స్
Minister Komati Reddy Venkat Reddy

హైదరాబాద్: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గురువును మించిన శిష్యుడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. జగదీష్ రెడ్డి ఇంటర్నేషనల్ లీడర్ అని ఎద్దేవా చేశారు. ఆయన ఇవాళ(సోమవారం) మీడియాతో మాట్లాడారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కమిషన్లు ఎవరు ఇస్తే వాళ్ళ వెంట తిరిగేవారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌల్‌లో ఎకరం రూ.50 లక్షలు ఉంటే.. జగదీష్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఎకరం రూ.40 కోట్లు ఉంటుందని చెప్పుకొచ్చారు.


జగదీష్ రెడ్డి గురువును మించిన శిష్యుడు..

జగదీష్ రెడ్డి ఫామ్‌హౌస్ 80 ఎకరాలతో కేసీఆర్ జేజమ్మ లెక్క ఉటుందని మంత్రి వెంకట్ రెడ్డి ఆరోపించారు. జగదీష్ రెడ్డి చేసిన అవనీతిపై విచారణ చేపిస్తున్నామని బాంబు పేల్చారు. కేసీఆర్ కంటే ఎక్కువ జగదీష్ రెడ్డి సంపాదించారని దుయ్యబట్టారు. త్వరలో అవినీతికి పాల్పడిన నాయకులు చిట్టా బయటకు తీస్తామని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన నాయకులు తప్పకుండా.. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


కేసీఆర్ అరెస్ట్‌ ఖాయం..

అనంతరం కేసీఆర్ అరెస్ట్‌పై వెంకట్ రెడ్డి సెటైరికల్‌గా స్పందించారు. సినిమాల్లో విలన్ల అరెస్టు క్లైమాక్స్ వరకు జరగదని తెలిపారు. విలన్లు ఫైనల్లోనే.. అరెస్ట్ అవుతారని గుర్తుచేశారు. అరెస్ట్ అనేది తమ పనికాదని.. పోలీసులు చూసుకుంటారని పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన అవినీతి తెలిస్తే గుండె పలిగి చనిపోతారని విమర్శించారు. కాళేశ్వరం నివేదికతో కేసీఆర్ అస్సలు రంగు బయటపడిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతారో చెప్పలేమని కానీ అరెస్ట్ మాత్రం ఖాయమని మంత్రి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పార్టీ విలీనంపై కేసీఆర్ అత్యవసర సమావేశం..!

కాగ్ నివేదికతో రేవంత్ ప్రభుత్వం అసమర్థత బయటపడింది

Updated Date - Aug 11 , 2025 | 08:31 PM