Minister Komatireddy: అధికారులు పనుల్లో వేగం పెంచాలి.. మంత్రి వెంకట్‌రెడ్డి కీలక ఆదేశాలు
ABN , Publish Date - Jun 22 , 2025 | 09:27 PM
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ సెక్రటేరియట్‌లో ఇవాళ(ఆదివారం) ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పలు అంశాలపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి వెంకట్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) తెలంగాణ సెక్రటేరియట్‌లో ఇవాళ(ఆదివారం) ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పలు అంశాలపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి వెంకట్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో కొనసాగుతున్న పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
త్వరగా వాడుకలోకి వచ్చే పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. పెండింగ్‌లో ఉన్న 5 జిల్లా సమీకృత కార్యాలయాలు, ఆర్వోబీల నిర్మాణం త్వరగా పూర్తి కావాలని ఆదేశించారు. మంచి రోడ్లు ఉంటే రవాణా సౌకర్యం పెరుగుతుందని.. అది అభివృద్ధికి సూచిక అవుతుందని తెలిపారు. నిర్మాణం చివరి దశలో ఉన్న ఆర్వోబీలు, మెడికల్ కాలేజీలు, టిమ్స్‌పై దృష్టి సారించాలని అన్నారు. వర్క్ ఏజెన్సీల పెండింగ్ బిల్లులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడతానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.
బడ్జెట్ నిధులను అన్ని శాఖలకు సమానంగా పంచాలి: మల్లు భట్టి విక్రమార్క

గత ప్రభుత్వ పథకాలను ఏ ఒక్కటీ ఆపకుండా అమలు చేస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా రూ.33,600 కోట్లతో సంక్షేమ పథకాలు చేపట్టామని వివరించారు. గతేడాది ప్రభుత్వానికి ORR, ఎక్సైజ్ ఆదాయాలు రాలేదని చెప్పారు. బడ్జెట్ నిధులు కొన్ని శాఖలకు ఎక్కువ, కొన్ని శాఖలకు తక్కువగా అందాయని వెల్లడించారు. బడ్జెట్ నిధులను అన్ని శాఖలకు సమానంగా పంచాలని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
కాగా, తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ ఆదివారం భేటీ అయింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి పనులు, అవసరమైన నిధులు, వనరుల సమీకరణపై మంత్రులు చర్చించారు. రేపు(సోమవారం) కేబినెట్‌లో సబ్ కమిటీ నివేదికని సమర్పించనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జరుగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బనకచర్లపై కేబినెట్ చర్చించనుంది. సంక్షేమ పథకాలు, పెండింగ్ పనులపైనా మంత్రిమండలి మాట్లాడనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రన్‌వేపై విమానం.. ఆందోళనలో ప్రయాణికులు
అంబటి రాంబాబుపై మళ్లీ కేసులు నమోదు
For Telangana News And Telugu News