Minister Jupally on Tourism Conclave: తెలంగాణలో త్వరలో టూరిజం కాన్‌క్లేవ్: మంత్రి జూపల్లి
ABN , Publish Date - Sep 19 , 2025 | 08:01 PM
త్వరలోనే అత్యున్నత స్థాయి టూరిజం కాన్‌క్లేవ్ నిర్వహిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పెట్టుబడులే లక్ష్యంగా టూరిజం కాన్‌క్లేవ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు.
హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో త్వరలోనే అత్యున్నత స్థాయి టూరిజం కాన్‌క్లేవ్ (Tourism Conclave) నిర్వహిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) తెలిపారు. పెట్టుబడులే లక్ష్యంగా ఈ టూరిజం కాన్‌క్లేవ్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు టూరిజం శాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిందని చెప్పుకొచ్చారు. ఇవాళ (శుక్రవారం) ట్రావెల్, టూరిజం ఫెయిర్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మంత్రి జూపల్లి కృష్ణారావు.
కొత్త పర్యాటక విధానం ఉపాధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలకు కాంక్లేవ్ దోహదం చేయనుందని తెలిపారు. టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తోందని వెల్లడించారు. ప్రపంచ స్థాయి పర్యాటకానికి కావాల్సిన వనరులన్నీ తెలంగాణలోనే ఉన్నాయని వివరించారు. తెలంగాణ పర్యాటకానికి తగిన స్థాయిలో ప్రచారం లభించలేదని పేర్కొన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు.
ఎగ్జిబిటర్లు, ట్రావెల్ , హాస్పిటాలిటీ రంగంలో తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ బతుకమ్మ పండుగ వేడుకలను (Batukamma Festival) ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు. చారిత్రక వెయ్యి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ వేడుకలు ప్రారంభం అవుతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం.. ఏమైందంటే..
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి: సీఎం రేవంత్‌రెడ్డి
For More Telangana News And Telugu News