Minister Jupalli: తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుదాం :మంత్రి జూపల్లి
ABN , Publish Date - Dec 30 , 2025 | 05:42 PM
పర్యాటక రంగంలో నూతన ఒరవడి రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. పర్యాటక అద్భుతాలను ప్రపంచానికి చూపాలని అన్నారు. తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుదామని తెలిపారు.
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పర్యాటక రంగాన్ని దేశానికే దిక్సూచిగా తీర్చిదిద్దాలని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వినూత్న మార్పులు అవసరమని పేర్కొన్నారు. ఇవాళ(మంగళవారం) తారామతి బరాదరిలో ‘టూరిజం అండ్ ఇట్స్ విజన్ 2026’ మేధోమథన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీటీడీసీ రూపొందించిన టేబుల్ క్యాలెండర్–2026ను ఆవిష్కరించారు.
అనంతరం టూరిజం అండ్ ఇట్స్ విజన్ – 2026 వర్క్‌షాప్‌లో అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడారు మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. ప్రకృతి, వారసత్వ సంపదే తెలంగాణ బలమని చెప్పుకొచ్చారు. కొత్త అద్భుతాలు కాదని.. ఉన్న వనరులకు మెరుగులు పరిస్తే చాలని తెలిపారు. దేశీ, విదేశీ పర్యాటకులు తెలంగాణ వైపు చూసేలా తాము ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు .
గ్రామీణ అద్భుతాలను నగరవాసులకు చేరవేయాలని సూచించారు. పర్యాటక రంగంలో నూతన ఒరవడి రావాలని కోరారు. పర్యాటక అద్భుతాలను ప్రపంచానికి చూపాలని అన్నారు. తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుదామని తెలిపారు. వినూత్న ఆవిష్కరణలతో పర్యాటకులను ఆకర్షించాలని చెప్పుకొచ్చారు. వసతులు, హాస్పిటాలిటీలో రాజీ పడొద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
నగరంలో జింక మాంసం కలకలం.. నిందితుల గుట్టురట్టు చేసిన పోలీసులు
అలర్ట్.. న్యూఇయర్ వేళ పోలీసుల కీలక సూచన
Read Latest Telangana News And Telugu News