Share News

KTR: ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదు: కేటీఆర్

ABN , Publish Date - Jun 28 , 2025 | 05:04 PM

ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదని మాజీమంత్రి కేటీఆర్ సూచించారు. శాంతియుతంగా ఉండాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

KTR: ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదు: కేటీఆర్
KTR

హైదరాబాద్: తెలంగాణలో ఆరాచకత్వం పెట్రేగిపోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఆరోపించారు. రేవంత్‌రెడ్డి లాంటి నేతలు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంటే, అబద్ధాలు, దుష్ప్రచారాలుగా సమాజంలో రోజువారి సాధారణ అంశాలుగా మారిపోతాయని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదని సూచించారు. శాంతియుతంగా ఉండాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.


ఇవాళ(శనివారం) తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అబద్ధాలకు, అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అస్సలు తావుండకూడదని సూచించారు. ఈనాటి దిగజారుడు రాజకీయాల్లో అన్ని మెయిన్ స్ట్రీమ్‌కి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన మిత్రులదే ఈ పాపమని విమర్శించారు. బీఆర్‌ఎస్ సోదర, సోదరీమణులందరూ ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌పై ముఖ్యమంత్రి, ఆయన అనుచరగణం చేస్తున్న బురదల్లే కుట్రపూరిత కార్యక్రమంపై చట్టబద్ధమైన ప్రక్రియను నమ్మి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు మాజీ మంత్రి కేటీఆర్.


పార్టీపైన శ్రేణులకు ఉన్న ప్రేమను, నిబద్ధతను తాను పూర్తిగా అర్థం చేసుకోగలనని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. అదే విధంగా పార్టీపై, నాయకులపై జరుగుతున్న దుష్ప్రచారంపై మీలో ఉన్న ఆవేదనను కూడా తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఈ విషయాల్లో న్యాయస్థానాలను ఆశ్రయిద్దామని సూచించారు. ఈ సిగ్గుమాలిన బురదజల్లే రాజకీయాలకు మనం చట్టబద్ధంగా సమాధానం ఇవ్వాలని చెప్పారు. మనం అందరం ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలపై, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, మోసాలపై ప్రశ్నించడం పైనే దృష్టి సారించాలని మాజీమంత్రి కేటీఆర్ కోరారు.


ఇవి కూడా చదవండి

దేశ రాజధానిలో బోనాల జాతర

యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో ట్విస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 28 , 2025 | 06:08 PM