Minister Komatireddy: దోచుకున్న సొమ్మునంతా కక్కిస్తాం... పేదలకు అందిస్తాం..
ABN , Publish Date - Sep 10 , 2025 | 06:18 PM
రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తాము పాల్పడమని, చట్ట ప్రకారమే అన్ని జరుగుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కమిటీల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని, ఒక్కో కమిటీ రిపోర్ట్ వచ్చాక దోషులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
నల్గొండ: కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ- కారు రేస్, ధరణిలో దోచుకున్న సొమ్మునంతా కక్కిస్తాం... పేదలకు అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ(బుధవారం) మీడియాతో మాట్లాడారు.. పక్క రాష్ట్రంలో మాజీ మంత్రులు ఎంపీ, ఎమ్మెల్యేలు అరెస్ట్ అవుతున్నారని తెలిపారు. ఇక్కడ అరెస్టులు లేవని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా ఖూనీ చేస్తుందని ఆరోపించారు.
రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తాము పాల్పడమని, చట్ట ప్రకారమే అన్ని జరుగుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కమిటీల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని, ఒక్కో కమిటీ రిపోర్ట్ వచ్చాక దోషులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎఫ్ - 1 రేసులో క్యాబినెట్ తీర్మానం లేకుండా విదేశీ కంపెనీలకు ఇవ్వడం.. ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినట్టు ఆధారాలు ఉన్నప్పుడు ఎవరు ఆపినా వారి అరెస్టులు ఆగవని ఆయన స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..