Komatireddy: కేటీఆర్, హరీష్‌రావులపై మంత్రి కోమటిరెడ్డి ఏమన్నారంటే..
ABN , Publish Date - Jan 29 , 2025 | 12:21 PM
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఇద్దరూ తన కాలి గోటికి సరిపోరని అన్నారు. టీఆర్ పనికిరాని వ్యక్తి అని, పనికి రాని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్‌లా తాను ఎలక్షన్, కలెక్షన్ చేయలేదని మంత్రి అన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) కేటీఆర్ (KTR), హరీష్‌రావు (Harish Rao)లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) తీవ్రస్థాయిలో విమర్శలు (Comments) చేశారు. బుధవారం గాంధీభవన్ (Gandhi Bhavan)లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్, హరీష్ రావులు తన కాలి గోటికి కూడా సరిపోరని, కేటీఆర్ పనికిరాని వ్యక్తి అని, పనికి రాని మాటలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ (Gaddar) ఉన్నరా.. బండి సంజయ్ (Bandi Sanjay) ఉన్నరా.. అని ప్రశ్నించారు. గద్దర్‌కు అవార్డ్ ఇస్తే తప్పేంటని నిలదీశారు. కాంగ్రెస్ మీటింగ్‌లో పల్లీలు, ఐస్ క్రీంలు అమ్ముకునేంత మంది కూడా కేటీఆర్ మీటింగ్‌కు రాలేదని ఎద్దేవా చేశారు. నల్లగొండలో టీ హాబ్‌కు తాళం వేసిందే కేటీఆర్ అని అన్నారు. కేటీఆర్‌పై ఉన్న అవినీతి ఆరోపణలు తనపై లేవని అన్నారు. కేసీఆర్ లా తాను ఎలక్షన్, కలెక్షన్ చేయలేదన్నారు. ప్రతిపక్ష నేత పదవి కోసం హరీష్ రావు, కేటీఆర్ కత్తులతో పొడుచుకుంటున్నారన్నారు. ప్రతిపక్ష నేతగా భట్టి పాదయాత్ర చేసి, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని, కేసీఆర్ బడ్జెట్ సెషన్‌కు వస్తారో.. రారో చెప్పాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
ఈ వార్త కూడా చదవండి..
వారితో పర్యటన చాలా సంతృప్తి ఇచ్చింది..
ముఖాముఖీ కార్యక్రమం
గాంధీ భవన్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. చాల రోజుల గ్యాప్ తర్వాత ముఖాముఖీ కార్యక్రమం జరుగుతోంది. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల నుండి మంత్రి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం గాంధీ భవన్‌కు చాల మంది వస్తున్నారు.
కాగా తెలుగు సినీ ఇండస్ర్టీకి తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం డబ్బింగ్ థియేటర్ నిర్వాహకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సినీ కళాకారులు, కార్మికుల శ్రేయస్సుకు నిరంతరం కృషి చేస్తున్నామని, వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన వద్దకు వచ్చి పరిష్కరించుకోవచ్చన్నారు.
దేశంలోనే తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని, వాటిని మరింతమెరుగుప్చుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. సినిమా ఇండస్ట్రీని మరింత విస్తరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. త్వరలోనే వాటి వివరాలను వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేంద్ర, సినీ నిర్మాతల మండలి ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ రెడ్డి, ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్ బొల్లా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈనెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
ఆడపిల్ల పుడుతుందని తెలిసి ఆ భర్త ఏం చేశాడంటే...
సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News