TG Bharath.. వారితో పర్యటన చాలా సంతృప్తి ఇచ్చింది: మంత్రి టీజీ భరత్
ABN , Publish Date - Jan 29 , 2025 | 11:24 AM
చాలా తక్కువ వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు మారనున్నాయని, భారీ పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఆరు నెలలలోపే ఈ అభివృద్ధి ఫలితాలు ప్రజలకు కనిపిస్తాయన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనతో పారిశ్రామిక, వ్యాపార వేత్తలు భయపడి పారి పోయారని.. అలాంటి వారంతా ఇప్పుడు ఏపీకి రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
కర్నూలు: దావోస్ పర్యటన గ్రాండ్ సక్సెస్ (Davos trip a Grand Success) అయ్యిందని, సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu), మంత్రి లోకేష్ (Nara Lokesh)తో కలిసి వెళ్లిన ఈ పర్యటన చాలా సంతృప్తిని ఇచ్చిందని మంత్రి టీజీ భరత్ (TG Bharath) అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన కర్నూలులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ... ఇండియా (India)లో పెట్టుబడులు పెట్టాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుర్తుకు వచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌లో పారిశ్రామిక వేత్తలకు వివరించారని అన్నారు. ఈ క్రమంలో పారిశ్రామిక, వ్యాపార వేత్తలు ఏపికి రావడానికి ఆసక్తితో ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ వార్త కూడా చదవండి..
ఈనెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
చాలా తక్కువ వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు మారనున్నాయని, భారీ పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఆరు నెలల లోపే ఈ అభివృద్ధి ఫలితాలు ప్రజలకు కనిపిస్తాయన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనతో పారిశ్రామిక, వ్యాపార వేత్తలు భయపడి పారి పోయారని.. అలాంటి వారంతా ఇప్పుడు ఏపీకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు పెట్టుబడులు తెచ్చామని అన్నారు... అయితే ఏ ఒక్కటి ఆచరణలో పెట్టలేదని మంత్రి టీజీ భరత్ విమర్శించారు.
కాగా దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు జ్యూరిక్‌లో తెలుగు పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి టీజీ భరత్ మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు వివిధ రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నారని, చివరకు ఎక్కడ ఎక్కువ సబ్సిడీలు లభిస్తే ఆ రాష్ట్రానికే వెళ్లిపోతున్నారని అన్నారు. ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహకాలతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తోందని చెప్పారు. పైగా చంద్రబాబు బ్రాండ్ తమ రాష్ట్రానికి అదనపు అడ్వాంటేజ్‌గా పేర్కొన్నారు. అందుకే 7 నెలల్లోనే రాష్ట్రంలో రూ. లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి బీపీసీఎల్, రిలయన్స్, ఎన్‌టీపీసీ, మిట్టల్ స్టీల్స్ వంటి కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. స్విట్జర్లాండ్ నుంచి కూడా పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని, వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని మంత్రి టీజీ భరత్ హామీ ఇచ్చారు. కచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను కొన్ని దశాబ్దాలపాటు పరిపాలిస్తుందని, అందుచేత ఎలాంటి సమస్యా ఉండదని వారికి భరోసా ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆడపిల్ల పుడుతుందని తెలిసి ఆ భర్త ఏం చేశాడంటే...
సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం..
GSLV F-15 రాకెట్.. ప్రయోగం విజయవంతం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News