Share News

Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కీలక పరిణామం

ABN , Publish Date - Jul 23 , 2025 | 01:50 PM

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. వాదనలు విన్న అనంతరం ఈ విచారణని ఆగస్టు 13వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

 Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కీలక పరిణామం
Kancha Gachibowli Land Dispute

ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై (Kancha Gachibowli Land Dispute) సుప్రీంకోర్టులో (Supreme Court) ఇవాళ(బుధవారం జులై 23) విచారణ జరిగింది. వాదనలు విన్న అనంతరం ఈ విచారణని ఆగస్టు 13వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో చేపట్టిన పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై రిప్లై దాఖలుకు ప్రతివాదులు సమయం కోరారు. ప్రతివాదుల విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేసింది సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం.


సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది ప్రభుత్వం. కంచ గచ్చిబౌలి భూముల్లో అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసిన వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. గత విచారణ సందర్భంగా... స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో తెలంగాణ ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

వచ్చే 3 రోజులు అతి భారీ వర్షాలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 23 , 2025 | 02:06 PM