KCR On Vinayaka Chavithi: రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. : కేసీఆర్
ABN , Publish Date - Aug 27 , 2025 | 07:13 AM
దేశ ప్రజల సామాజిక జీవన విధానంలో గణపతి నవరాత్రుల వేడుకలు.. పల్లె నుండి పట్టణం వరకు ప్రజల సాంస్కృతిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తుందని కేసీఆర్ అన్నారు. వినాయక చవితి పర్వదినం నుండి ప్రారంభం అయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా.. ప్రజల్లో మతసామరస్యం, దైవభక్తి, సమష్టి తత్వం బలపడాలని ఆకాంక్షించారు.
హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం కలిసి వచ్చి, రైతన్నల కుటుంబాల్లో సుఖ శాంతులు వెల్లివిరిసేలా దీవించాలని గణనాథుని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. అన్ని విఘ్నాలను తొలగించి ప్రజలకు శుభాలను చేకూర్చే ఆదిదేవునిగా విఘ్నేశ్వరుడు హిందూ మత సంప్రదాయంలో ప్రత్యేక పూజలు అందుకుంటారని చెప్పారు.
దేశ ప్రజల సామాజిక జీవన విధానంలో గణపతి నవరాత్రుల వేడుకలు.. పల్లె నుండి పట్టణం వరకు ప్రజల సాంస్కృతిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తుందని కేసీఆర్ అన్నారు. వినాయక చవితి పర్వదినం నుండి ప్రారంభం అయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా.. ప్రజల్లో మతసామరస్యం, దైవభక్తి, సమష్టి తత్వం బలపడాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం కలిసి వచ్చి, రైతన్నల కుటుంబాల్లో సుఖ శాంతులు వెల్లివిరిసేలా దీవించాలని గణనాథుడిని ప్రార్థించారు. ప్రతి కుటుంబం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ఆ గణనాథుడు అందరినీ అనుగ్రహించాలని కోరుకుంటున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి ఉత్తమ్‌కు హరీష్ రావు సంచలన లేఖ