Madannapet Child Case: కాళ్లు కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేసి మరీ..
ABN , Publish Date - Oct 04 , 2025 | 10:05 AM
పాతబస్తీ మాదన్నపేట్‌లో ఏడేళ్ల చిన్నారిని కిరాతకంగా హత్యచేశారు చిన్నారి మేనమామ, అత్త. ఆస్తి పంపకాల విషయంలో చిన్నారి తల్లితో మేనమామ, అత్తకు విభేదాలు ఉన్నాయి. ఇంట్లో అల్లరి చేస్తుందన్న కోపంతో చిన్నారిని దారుణంగా హత్య చేశారు.
హైదరాబాద్, అక్టోబరు4 (ఆంధ్రజ్యోతి): పాతబస్తీ మాదన్నపేట్‌లో ఏడేళ్ల చిన్నారి (Madannapet Child Case) ని అతి కిరాతకంగా హత్య చేశారు చిన్నారి మేనమామ, అత్త. ఆస్తి పంపకాల విషయంలో చిన్నారి తల్లితో మేనమామ, అత్తకు విభేదాలు ఉన్నాయి. ఇంట్లో అల్లరి చేస్తోందన్న కోపంతో చిన్నారిని దారుణంగా హత్య చేశారు మేనమామ, అత్త. బాలిక నోటికి ప్లాస్టర్ వేసి చేతులు, కాళ్లు కట్టేసి వాటర్ ట్యాంక్‌లో పడేశాడు మేనమామ.
అయితే, మాదన్నపేటలో చిన్నారి హత్య కేసును పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఈ హత్యపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో చర్యలు చేపట్టారు. మేనమామ, అత్తే చిన్నారిని హత్య చేసినట్లు విచారణలో తేలింది. దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. వారిద్దరిని కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హైడ్రా దూకుడు.. భాగ్యనగరంలో మరోసారి కూల్చివేతలు
అధికారిక లాంఛనాలతో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు
Read Latest TG News And Telugu News