Moosi River Floods: ఆ వార్తల్లో.. నిజం లేదు : జీహెచ్ఎంసీ
ABN , Publish Date - Sep 27 , 2025 | 09:57 AM
ముసరాంబాగ్ దగ్గర మూసీ నదిపై నిర్మిస్తున్న కొత్త వంతెన మూసి ఉద్ధృతికి దెబ్బతిందన్న వార్తలు సోషిల్ మీడియాలో, మీడియా ఛానల్స్‌లో ప్రచురితం అయ్యాయి.
హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది. భారీ వర్షాల కారణంగా మూసీ నదిలో నీటి ప్రవాహం పెరిగిపోవడంతో, ముసరాంబాగ్ వంతెన మూసివేశారు. దీంతో రాకపోకలు నిలిపివేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో మూసీ నదికి వరద ఉధృతి రావడంతో కొత్తగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కొత్త వంతెన సామగ్రి కొట్టుకుపోయింది. వరదల వల్ల పాతబస్తీ, అంబర్‌పేట, చాదర్‌ఘాట్ నుంచి ఎంజీబీఎస్ వరకు నీరు చేరింది. ఈ పరిస్థితి స్థానికులలో ఆందోళన కలిగిస్తోంది.
అయితే.. ముసరాంబాగ్ దగ్గర మూసీ నదిపై నిర్మిస్తున్న కొత్త వంతెన మూసి ఉద్ధృతికి దెబ్బతిందన్న వార్తలు సోషిల్ మీడియాలో, మీడియా ఛానల్స్‌లో ప్రచురితం అయ్యాయి. ఆ వార్తలను జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి ఖండించారు. వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. పనుల్లో భాగంగా P1, P2 పిల్లర్ల మధ్య ఏర్పాటు చేసిన సెంట్రింగ్ మాత్రమే వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిందని తెలిపారు. ఇప్పటి వరకూ పూర్తి అయిన బ్రిడ్జి పెనులను ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఆయన వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
వెలిగొండ ఫీడర్ కాలువ లైనింగ్‌కు రూ.456 కోట్లు