KCR TO HIGH COURT: నేడు హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై విచారణ..
ABN , Publish Date - Aug 21 , 2025 | 09:52 AM
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి వరదలై పారిందని ఘోష్ కమిషన్ నివేదిక కుండబద్దలు కొట్టింది. దీనంతటికీ కేసీఆర్ పూర్తి బాధ్యుడని సూటిగా చెప్పింది. బ్యారేజీల కుంగుబాటు వ్యవహారం అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగింది కాబట్టే ఆ ప్రాజెక్టు మాటున సాగిన దారుణాలు బయటికి వచ్చాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై ఇవాళ(గురువారం) హైకోర్టులో విచారణ జరగనుంది. ఇరువురు వేసిన రెండు పిటిషన్లను కలిపి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు విచారణ చేపట్టనున్నారు. కేసీఆర్, హరీష్ రావులు ధాఖలు చేసిన పిటిషన్లలో ఐదు అంశాలను కీలకంగా రాసుకోచ్చారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక రద్దు చేయాలని కోరారు. కమిషన్ నియమిస్తూ.. గత ఏడాది జీఓను కొట్టేయాలని తెలిపారు. తమకు కమిషన్ ఎలాంటి నివేదికను ఇవ్వలేదని పేర్కొన్నారు. కమిషన్ విచారణ సమయంలో యాక్ట్ సెక్షన్ 8బీ, 8సీ నోటీసులు అందలేదని చెప్పుకొచ్చారు. కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని పిటిషన్‌లో రాసుకొచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి వరదలై పారిందని ఘోష్ కమిషన్ నివేదిక కుండబద్దలు కొట్టింది. దీనంతటికీ కేసీఆర్ పూర్తి బాధ్యుడని సూటిగా చెప్పింది. బ్యారేజీల కుంగుబాటు వ్యవహారం అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగింది కాబట్టే ఆ ప్రాజెక్టు మాటున సాగిన దారుణాలు బయటికి వచ్చాయి. ఒక ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఆద్యంతం తానే అయి పాత్ర పోషించడంతో ఈ అంశం చర్చనీయాంశం అయింది. మేడిగడ్డ బ్యారేజీని ఎక్కడ కట్టాలో నిర్దేశించింది కేసీఆర్. ఎలా కట్టాలీ, ఎంత నీరు నిల్వ చేయాలీ, ఎలా నిర్వహించాలి అన్న విషయాలతో పాటు, ప్రాజెక్టు ఆర్థిక అంచనాలను మార్చేసింది కూడా కేసీఆర్ అనే నివేదికలో చెప్పుకొచ్చింది.
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ.. కేసీఆర్, హరీష్ రావులు రెండు పిటిషన్లు దాఖలు చేశారు. కాళేశ్వరం నివేదికలో ముఖ్య సూత్రధారులుగా ఇరువురి పేర్లను ఘోష్ కమిషన్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వారు హైకోర్టులో పిటిషన్లు ధాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రేవంత్ ప్రభుత్వం కమిషన్ వేసిందని హరీష్ రావు ఆరోపించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. గతంలో విద్యుత్ కొనుగోళ్ల అంశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్‌పై కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లి రిలీఫ్ పొందారు. కాగా, ఇప్పుడు కాళేశ్వర కమిషన్ నివేదికపై కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇవాళ పిటిషన్ల విచారణ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...
‘కన్ఫర్డ్’లుగా 17 మంది సిఫారసు!
విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తీసేయండి