Rajendranagar Murder: రాజేంద్రనగర్‌లో దారుణం.. అత్యంత కిరాతకంగా హత్య..
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:10 AM
రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. ప్రాథమిక విచారణలో కత్తితో గొంతుకోసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు ఆనవాళ్లు గుర్తించామని పేర్కొన్నారు.
హైదరాబాద్: రాజేంద్రనగర్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. వ్యవసాయ వర్సిటీ సమీపంలోని బెంగళూరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయ్యింది. అటుగా వెళ్తున్న స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న శవాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఘటనకు సంబంధించి వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. ప్రాథమిక విచారణలో కత్తితో గొంతుకోసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు ఆనవాళ్లు గుర్తించామని పేర్కొన్నారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడో హత్య చేసి శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అసలు హత్యకు గురైన వ్యక్తి ఎవరు..? ఎందు కోసం హత్య చేశారు..? హత్య చేసి ఇక్కడి వరకు తీసుకురావల్సిన అవసరం ఏంటి..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసును ఛేదించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస హత్యలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి. కాగా, గత కొన్ని రోజుల క్రితం నగరంలో.. మహిళల మృతదేహాలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
కమిషనర్ వార్నింగ్.. పనితీరు మారకుంటే చర్యలు తప్పవు