GHMC: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.. బీజేపీ దూరం.. విత్‌డ్రా యోచనలో బీఆర్ఎస్
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:57 PM
GHMC: జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను ప్రతీ ఏడాది ఎన్నుకోవడం జరుగుతుంది. నేటితో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటికే ఏడుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లు నామినేషన్ వేయగా..

హైదరాబాద్, ఫిబ్రవరి 17: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు (GHMC standing committee elections) నామినేషన్ల స్వీకరణ గడువు నేటితో (సోమవారం) ముగియనుంది. కాంగ్రెస్ నుంచి ఏడుగురు కార్పొరేటర్లు నామినేషన్ వేశారు. అలాగే ఎమ్‌ఐఎమ్ నుంచి ఎనిమిది మంది కార్పొరేటర్లు నామినేషన్ వేయనున్నారు. దీంతో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. కాంగ్రెస్ నుంచి బాబా ఫసిద్దిన్, రహ్మాత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, హస్తినాపురం కార్పొరేటర్ బాణోతు సుజాత నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్, ఆర్సీ పురం కార్పొరేటర్ పుష్ప నగేష్ కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేశారు.
ఎనిమిది మంది ఎమ్‌ఐఎమ్ కార్పొరేటర్లు, మరో ఇద్దరు కాంగ్రెస్ కార్పొరేటర్లు నామినేషన్ వేయనున్నారు. 15 మంది ఉండనున్న స్టాండింగ్ కమిటీలో ఇరు పార్టీల ఒప్పందంతో కాంగ్రెస్ నుంచి ఏడుగురు, ఎమ్‌ఐఎమ్ నుంచి ఎనిమిది మంది పోటీకి దిగనున్నారు. అయితే మెజారిటీ సంఖ్యా బలం లేదని స్టాండింగ్ కమిటీ ఎన్నికకు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించింది. బీఆర్ఎస్ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు నామినేషన్ వేశారు. అయితే సంఖ్యాబలం లేకపోవడంతో నామినేషన్లు విత్ డ్రా చేసుకునే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది.
Farmhouse Case: ఫామ్‌హౌస్ కేసు.. పోలీసులకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వివరణ
జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. మొత్తం 15 మంది స్టాండింగ్ కమిటీ నామినేషన్లకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఏడుగురు నామినేషన్ వేయగా, ఎంఐఎం నుంచి ఎనిమిది మంది కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. ఇక బీఆర్‌ఎస్ నుంచి మూడు రోజుల క్రితం ఇద్దరు నామినేషన్ వేశారు. సంఖ్యాబలం లేకపోవడంతో 41 మంది బీజేపీ కార్పొరేటర్లు ఉన్నప్పటికీ నామినేషన్ వేసేందుకు వెనుకడుగు వేశారు. ఈ నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ ఎన్నిక నుంచి బీజేపీ కార్పొరేటర్లు వైదొలిగారు. మరోవైపు నామినేషన్లు వేసిన ఇద్దరు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కూడా నామినేషన్లు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఎన్నికలు లేకుండానే జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగనున్నాయి.
జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను ప్రతీ ఏడాది ఎన్నుకోవడం జరుగుతుంది. జీహెచ్‌ఎంసీలో పాలనాపరంగా, కొత్త ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా మేయర్, డిప్యూటీ మేయర్ అనంతరం ఈ 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎంతో కీలకం. గడిచిన పదేళ్ల వ్యవధిలో ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగలేదు. ప్రతీసారి కూడా ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతూ వస్తున్నారు. అయితే ఈ సారి బీజేపీ, బీఆర్‌ఎస్ సంఖ్యాబలం కొంత ఎక్కువగా ఉండటం, కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి రావడం, మేయర్, డిప్యూటీ మేయర్ పార్టీ మారడం ఈ పరిణామాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయని భావించినప్పటికీ బీఆర్‌ఎస్ నుంచి నామినేషన్ వేసిన ఇద్దరు కార్పొరేటర్లు కూడా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఎలాంటి ఎన్నిక లేకుండానే జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి...
హాస్టల్ బాత్రూంలో గుర్తుతెలియని వ్యక్తులు.. విద్యార్థినిల ఆందోళన
రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. పరిస్థితి ఎలా ఉందంటే..
Read Latest Telangana News And Telugu News