Share News

Students Protest: బాత్రూంలోకి తొంగిచూస్తున్నారు.. విద్యార్థినుల ఆందోళన

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:41 AM

Students Protest: హాస్టల్‌లో రక్షణ కరువైందంటూ విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. అనంత సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ గత అర్ధరాత్రి నిరసనకు దిగారు. తమకు హాస్టల్‌లో రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

Students Protest: బాత్రూంలోకి తొంగిచూస్తున్నారు.. విద్యార్థినుల ఆందోళన
Students protest

అనంతపురం, ఫిబ్రవరి 17: జిల్లాలోని సెంట్రల్ యూనివర్సిటీలో (Anantapur Central University) విద్యార్థినులు (Students) ఆందోళనకు దిగారు. హాస్టల్‌లో తమకు భద్రత కరువైందని వారు ఆరోపిస్తున్నారు. బాత్‌రూమ్‌లోకి గుర్తు తెలియని వ్యక్తులు తొంగిచూస్తున్నారంటూ అర్ధరాత్రి స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. రక్షణ కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. తరగతులను బహిష్కరించారు. విద్యార్థినుల ఆందోళనకు మద్దతుగా విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. హాస్టల్‌ గదుల్లోని, బాత్‌రూమ్‌లోకి కొంతమంది వ్యక్తులు తొంగి చూస్తున్నారని.. దీనిపై అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని పెద్దఎత్తున నిరసనకు దిగారు. అర్ధరాత్రి వరకు ఆందోళనలు చేశారు విద్యార్థినులు. తాము పడుతున్న ఇబ్బందులను, కష్టాలను కాలేజీ యజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా.. పట్టించుకోకపోవడమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సెంట్రల్ యూనివర్సిటీ హాస్టల్ చుట్టుపక్కల కన్‌స్ట్రక్షన్ పనులు చేస్తున్న కొంత మంది అదేపనిగా హాస్టల్‌ గదులతో పాటు, బాత్రూమ్ కిటీకీల నుంచి తొంగి చూస్తున్నారని, తమకు హాస్టల్‌లో రక్షణ కరువైన పరిస్థితి నెలకొందని స్టూడెంట్స్ వాపోతున్నారు. ఏ క్షణంలో ఎవరు వస్తారో అనే ఆందోళనలో విద్యార్థినులు గడుపుతున్నారు. వీటిపై సెంట్రల్ యూనివర్సిటీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

CM Chandrababu: గుంటూరు రోడ్డు ప్రమాదంపై సీఎం ఏమన్నారంటే..


గత అర్ధరాత్రి వరకు ఆందోళన చేసిన స్టూడెంట్స్.. ఈరోజు ఉదయం కూడా ఆందోళనను మరింత ఉధృతం చేసే అవకాశం ఉండటంతో సెంట్రల్ యూనివర్సిటీ యాజమాన్యం అప్రమత్తమైంది. ఏ ఒక్క విద్యార్థినిని కూడా బయటకు రానీయకుండా పూర్తిస్థాయిలో కట్టుదిట్టం చేశారు. ఎవరూ కూడా ఆందోళన చేయొవద్దని.. అలా చేస్తే చర్యలు తీసుకుంటామని సెంట్రల్ యూనివర్సిటీ యాజమాన్యం బెదిరిస్తున్నారని విద్యార్థినులు వాపోతున్నారు. హాస్టల్‌లో ఉంటున్న స్టూడెంట్స్ సమస్యలను పరిష్కరించాలని, వెంటనే రక్షణ కల్పించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

Crime News.. విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత..

మహిళలకు గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 17 , 2025 | 12:24 PM