CM Chandrababu: గుంటూరు రోడ్డు ప్రమాదంపై సీఎం ఏమన్నారంటే..
ABN , Publish Date - Feb 17 , 2025 | 10:39 AM
CM Chandrababu: గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు సీఎం.

అమరావతి, ఫిబ్రవరి 17: గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పందించారు. రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీల మృతిపై సీఎం విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గరు వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. కూలీ పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
మంత్రి నాదెండ్ల దిగ్భ్రాంతి
గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి నాదెండ్ల మనోహర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మృతి చెందిన వ్యవసాయ కూలీల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి... బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
క్షతగాత్రులకు ఎమ్మెల్యే పరామర్శ
గుంటూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పరామర్శించారు. జీజీహెచ్‌లో మృతుల కుటుంబ సభ్యులను ధూళిపాళ్ల ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం చెందడం విచారకరమన్నారు. చనిపోయిన వారందరూ కూడా రెక్కల కష్టం మీద జీవించేవారు కావడం బాధాకరమని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ వైద్యులకు సూచించామని తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన మహిళల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బాధితులకు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన రహదారిని మరింత విస్తరించే అంశం ఎంపీల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Crime News.. విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత..
మహిళలకు గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు
Read Latest AP News And Telugu News