Fire incident: తెలంగాణలో మరో అగ్నిప్రమాదం.. ఏమైందంటే..
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:53 PM
రహమత్‌నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్‌లో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం ధాటికి మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
హైదరాబాద్, డిసెంబరు11(ఆంధ్రజ్యోతి): రహమత్‌నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్‌లో ఇవాళ(గురువారం) అగ్నిప్రమాదం (Fire incident) జరిగింది. ఈ మంటల్లో మూడు కార్లు, ఒక ఆటో దగ్ధమయ్యాయి. వీటితో పాటు సమీపంలో పార్కింగ్ చేసిన వాహనాలకు మంటలు అంటుకున్నాయి. అగ్నిప్రమాదం ధాటికి మంటలు ఎగసి పడుతున్నాయి. స్థానికులు ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు.
సమాచారం అందగానే సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఫైర్ సిబ్బంది. మరోవైపు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులను సంఘటనా స్థలం నుంచి దూరంగా పంపించివేస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై దగ్గరలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. గంజాయి మత్తులో ఓ వ్యక్తి చెత్తకు నిప్పు అంటించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌ను స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
అందుకే ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు కాల్స్: డీసీపీ రాజేశ్
Read Latest Telangana News and National News