Swathi Case ON Sensational Facts: పథకం ప్రకారమే హత్య.. స్వాతి కేసులో సంచలన నిజాలు
ABN , Publish Date - Aug 24 , 2025 | 07:14 PM
గర్భిణి అయిన భార్య స్వాతిని ఆమె భర్త మహేందర్‌రెడ్డి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన మేడిపల్లి బాలాజీహిల్స్‌లో జరిగింది. భార్య స్వాతిని చంపి మృతదేహాన్ని భర్త మహేందర్‌రెడ్డి ముక్కలు చేశాడు. తల, కాళ్లు, చేతులు వేరు చేసి భర్త మహేందర్‌రెడ్డి మూసీలో పడేశాడని డీసీపీ పద్మజారెడ్డి
మేడ్చల్, ఆగస్టు24(ఆంధ్రజ్యోతి): గర్భిణి అయిన భార్య స్వాతిని (Swathi Case) ఆమె భర్త మహేందర్‌రెడ్డి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన మేడిపల్లి (Medipally) బాలాజీహిల్స్‌లో (Balaji Hills) జరిగింది. భార్య స్వాతిని చంపి మృతదేహాన్ని భర్త మహేందర్‌రెడ్డి ముక్కలు చేశాడు. తల, కాళ్లు, చేతులు వేరు చేసి భర్త మహేందర్‌రెడ్డి మూసీలో పడేశాడు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను డీసీపీ పద్మజారెడ్డి (DCP Padmaja Reddy) మీడియాకు వెల్లడించారు. గర్భిణిని ఆమె భర్త మహేందర్‌రెడ్డి పథకం ప్రకారమే చంపారని తెలిపారు. దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు ఉన్నాయని డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు.
లవ్ మ్యారేజ్..
‘స్వాతి, మహేందర్ రెడ్డి ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత ఇద్దరు మధ్య గొడవలు అవుతున్నాయి. ఒక సంవత్సరం క్రితం అమ్మాయికి అబార్షన్ చేయించాడు. ఆమె మళ్లీ గర్భవతి అయింది. మెడికల్ చెకప్ తర్వాత ఇంటికి వెళ్తా అనగానే గొడవ పెట్టి ఆమెను కొట్టాడు. నిన్న ఉదయం బయటకు వెళ్లి సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ఆమెను కొట్టగా కళ్లు తిరిగి పడిపోయింది. బాడీ పార్ట్స్ అన్ని కోసేసి మూసీ నదిలో పడేశాడు. మూడు సార్లు మూసీ వద్దకు వెళ్లి శరీర భాగాలు పడేశాడు. ఆ తర్వాత తన భార్య కనపడటం లేదని మహేందర్ తన చెల్లికి ఇదే విషయాన్ని చెప్పాడు. మహేందర్ చెల్లి భర్త నరేందర్ రెడ్డికి అనుమానం కలిగి మిస్సింగ్ కింద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మహేందర్ బంధువు ఇచ్చిన సమాచారంతో మహేందర్ రెడ్డినీ అరెస్ట్ చేశాం. ఈ ఘటన జరిగిన స్థలంలో పలు ఆధారాలు సేకరించాం. స్వాతి మృతదేహామా లేదా మరో మహిళదా అని గుర్తించడానికి డీఎన్ఏ టెస్ట్ నిర్వహిస్తాం. గతంలో భార్య భర్తల గొడవల విషయంలో వికారాబాద్ సొంత గ్రామంలో పోలీసు కేసు నమోదైంది. పెద్దల సమక్షంలో రాజీ కుదిరింది. ఆపై హైదరాబాద్‌కు వచ్చారు. మహేందర్ రెడ్డి ర్యాపీడో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గతంలో అమ్మాయి కాల్ సెంటర్‌లో పనిచేసేది. తరచూగా ఫోన్ మాట్లాడుతుంటే అనుమానం వ్యక్తం చేశాడు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం’ అని డీసీపీ పద్మజారెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మడత పెట్టి కొట్టే రోజులు త్వరలో: కేటీఆర్
రాహుల్‌కి ముద్దు పెట్టిన యువకుడు.. చితక్కొట్టిన సిబ్బంది
For More Telangana News And Telugu News