Share News

Gun Fire IN Hyderabad: దొంగపై డీసీపీ కాల్పులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే...

ABN , Publish Date - Oct 25 , 2025 | 05:56 PM

హైదరాబాద్‌ నగరంలో ఇవాళ (శనివారం) కాల్పులు కలకలం సృష్టించాయి. సెల్‌ఫోన్ దొంగను పట్టుకునేందుకు డీసీపీ చైతన్య ప్రయత్నించారు. ఈ క్రమంలో డీసీపీ మీద కత్తితో దాడికి దొంగ యత్నించాడు.

Gun Fire IN Hyderabad: దొంగపై డీసీపీ కాల్పులు..  ఆ తర్వాత ఏం జరిగిందంటే...
Gun Fire IN Hyderabad

హైదరాబాద్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ (Hyderabad) నగరంలో ఇవాళ(శనివారం) కాల్పులు (Gun Fire) కలకలం సృష్టించాయి. సెల్‌ఫోన్ దొంగ (Cell Phone Thief)ను పట్టుకునేందుకు డీసీపీ చైతన్య (DCP Chaitanya) ప్రయత్నించారు. ఈ క్రమంలో డీసీపీ మీద కత్తితో దాడికి దొంగ యత్నించాడు. ఈ నేపథ్యంలో దొంగపై స్వయంగా డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు. ఈ తోపులాటలో డీసీపీ చైతన్య తుపాకీ కిందపడింది.


తన గన్ కిందపడటంతో పక్కనే ఉన్న గన్‌మెన్ తుపాకీని తీసుకుని దొంగపై డీసీపీ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరికి గాయాలు అయ్యాయి. గాయాలైన వ్యక్తిని నాంపల్లి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆ వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన సరూర్‌నగర్‌ విక్టోరియా గ్రౌండ్‌లో జరిగింది. ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

గుండాలకి రక్షణ కల్పిస్తున్న రేవంత్‌ ప్రభుత్వం.. ప్రవీణ్ కుమార్ ఫైర్

గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 25 , 2025 | 07:26 PM