Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో దొంగ ఓట్ల ప్రభావం ఉంటుంది : ఫిరోజ్ ఖాన్
ABN , Publish Date - Aug 12 , 2025 | 05:27 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల ప్రభావం భారీగానే ఉంటుందని ఫిరోజ్ ఖాన్ అంటున్నారు. దొంగ ఓట్లు 5 రకాలుగా ఉంటాయని తెలిపారు. పార్టీ ఆదేశిస్తే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓట్లను బయటపెడుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై అటూ అధికార పార్టీ, ఇటూ ప్రతిపక్ష పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. సీటు దక్కించుకోవాలని కాంగ్రెస్ నాయకులు వ్యూహాత్మక అడుగులు వేస్తూ.. ముందుకు వెళ్తున్నారు. మరోపక్క సానుభూతి కేటగిరీలో ఓట్లు గెలువాలని బీఆర్ఎస్ వ్యూహం రచిస్తుంది. అయితే తాజాగా.. ఎన్నికలపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో దొంగ ఓట్ల ప్రభావం ఉంటుందని బాంబు పేల్చారు. ఆయన ఇవాళ(మంగళవారం) ఏబీఎన్‌తో మాట్లాడారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల ప్రభావం భారీగానే ఉంటుందని ఫిరోజ్ ఖాన్ అంటున్నారు. దొంగ ఓట్లు 5 రకాలుగా ఉంటాయని తెలిపారు. పార్టీ ఆదేశిస్తే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓట్లను బయటపెడతానని ధీమా వ్యక్తం చేశారు. దొంగ ఓట్లు భారత దేశ మనుగడకే ముప్పు అని పేర్కొన్నారు. ఆధార్ కార్డుతో ఓటరు కార్డు అనుసంధానం చేస్తే.. 90 శాతం దొంగ ఓట్లను అరికట్టవచ్చని సూచించారు. ఈసీకి ఎంత చెప్పినా.. ఎన్ని ఆధారాలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు.
అయితే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూన్ 8వ తేదీన గుండెపోటుతో మృతి చెందడంతో.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంకు ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. ఆయన మృతితో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయని చెప్పుకోవచ్చు. ఉపఎన్నికలో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకోవాలని చూస్తుంటే.. కాంగ్రెస్ తన పట్టు సాధించాలని చూస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ చుట్టు పక్కల కాంగ్రెస్ అంతగా రాణించకపోవడంతో ఈ ఉపఎన్నిక ప్రభుత్వానికి సవాల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు