Devender Goud: జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ కోసం బయటకు వచ్చిన దేవేందర్ గౌడ్
ABN , Publish Date - Feb 14 , 2025 | 09:28 PM
Devender Goud: మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ రచించిన విజయ తెలంగాణ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసి బయటకు వచ్చారన్నారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణ ఉద్యమ చరిత్రను కొంత మంది తమకు అనుకూలంగా మలుచుకొన్నారని ముఖమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీనే తెలంగాణ అని చరిత్రలో రాసే ప్రయత్నం చేశారంటూ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, యువకుల త్యాగాలను చరిత్రలో లిఖించాలని ఆయన పేర్కొన్నారు. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రజల కోణంలో పొందు పరిచారని స్పష్టం చేశారు.
శుక్రవారం జలవిహార్‌లో మాజీ హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ రచించిన విజయ తెలంగాణ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆ నాడు తెలంగాణ కోసం దేవేందర్ గౌడ్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని ఆయన అభివర్ణించారు. ఆ నాడు ఆయన ఉన్న పార్టీలో నాయకుడి తర్వాత సరిసమానంగా చలామణి అయిన నేత దేవేందర్ గౌడ్ అని వివరించారు.
మంచి జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ కోసం బయటకు వచ్చారని చెప్పారు. గోదావరి జలాలతోనే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందంటూ.. అనాడు దేవేందర్ గౌడ్ పాదయాత్ర చేశారన్నారు. ఆయన పాదయాత్ర కారణంగానే ఆ నాటి పాలకులు చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టును చేపట్టారని తెలిపారు. తెలంగాణ అంటే టీజీ అని ఉద్యమంలో.. యువకులు బండ్ల పైనే కాడు గుండెలపైన రాసుకున్నారని చెప్పారు. దేవేందర్ గౌడ్ ఆనాడు గోడలపైన టీజీ అని రాయించారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ గుర్తు చేశారు.
ప్రజల ఆకాంక్ష మేరకు తమ ప్రభుత్వం రాగానే టీఎస్‌ను టీజీగా మార్చామని విశదీకరించారు. జయ జయహే తెలంగాణ పాట ను రాష్ట్ర అధికారిక గీతంగా తీసుకువచ్చామని.. ఇవన్నీ తన ఆలోచనలు కావని.. ప్రజల ఆలోచనలంటూ సీఎం రేవంత్ రెడ్డి విపులీకరించారు. తెలంగాణ ఉద్యమంలో సర్వస్వం త్యాగం చేసిన తొమ్మిది మంది ఉద్యమకారులకు ఇంటి స్థలంతోపాటు రూ. కోటి ప్రకటించామన్నారు. దేవేందర్ గౌడ్ లాంటి వారు క్రియాశీలక రాజకీయాల్లో లేకపోవడం తెలంగాణకు తీరని నష్టమని పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో విలువలతో కూడిన నాయకులు రావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read : సహకార సంఘాల పదవీ కాలం పొడిగించిన సర్కార్
Also Read : విజయవాడలో క్యాట్ సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు.. ముహూర్తం ఖరారు
Also Read: ప్రధాని మోదీకి ఎలాన్ మస్క్ గిఫ్ట్
Also Read: అమ్మో.. ర్యాగింగ్ ఇలా కూడా చేస్తారా?.. స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
Also Read : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి
Also Read: వసంత ప్రాణం తీసిన.. ఆ వీడియోలు
Also Read: ఆళ్ల నాని ఎంట్రీ.. ఏలూరు ఎమ్మెల్యే రియాక్షన్
Also Read: బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చురకలు.. ఎందుకంటే..?
For Telangana News And Telugu News