Share News

CM Revanth Reddy: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:56 PM

CM Revanth Reddy: యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం ఆయా నియోజకవర్గాల్లో అనువైన స్థలాలను పరిశీలించాలని విద్యాశాఖ అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే స్థల సేకరణ జరిగిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని సూచించారు.

CM Revanth Reddy: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్
CM Revanth Reddy

హైదరాబాద్: యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో ఇవాళ(శుక్రవారం) విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతీ నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ స్థలాల సేకరణ, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వంద నియోజవర్గాల్లో నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నియోజకవర్గాల్లో స్థలాల కేటాయింపుల్లో పూర్తయిన వాటికి అనుమతులకు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు.


అనువైన స్థలం లేని చోట ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించాలని సూచించారు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేసి వీలైనంత త్వరగా స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి స్థలాల గుర్తింపు ప్రక్రియకు సంబంధించి వారం రోజుల్లో రిపోర్ట్ అందించాలని చెప్పారు. ఇప్పటికే స్థల సేకరణ జరిగిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.


రెండేళ్లలో 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక వసతులతో వందశాతం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ఆ స్థాయి ప్రమాణాలతో సరైన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ప్లే గ్రౌండ్, అకాడమిక్ బ్లాక్, ఇతర సౌకర్యాలను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రమాణాలు పాటించకుండా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఆహార పదార్థాలు!

సంజయ్‌, కిషన్‌రెడ్డి.. కోతల రాయుళ్లు

ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్‌ ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలి

Mini Jatara.. మేడారంలో కొనసాగుతున్న మినీజాతర

Read Latest Telangana News and National News

Updated Date - Feb 14 , 2025 | 03:00 PM