CM Revanth Instructions to Officials: రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం వేగవంతం చేయాలి: సీఎం రేవంత్
ABN , Publish Date - Sep 22 , 2025 | 03:24 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం మాట్లాడారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్రంలోని జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ(సోమవారం) మాట్లాడారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఇందుకు అవసరమైన పెండింగ్ భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం అంశంపై సమీక్షలో చర్చించారు ముఖ్యమంత్రి. వీలైనంత త్వరగా రూట్ మ్యాప్‌పై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్- శ్రీశైలం హైవేలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం నుంచి వీలైనంత త్వరగా అనుమతులు తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని దిశానిర్దేశం చేశారు. అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యల వివరాలను ఉన్నతాధికారులకు అందించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభాకర్ బెయిల్ రద్దుపై సుప్రీం ఏం తేల్చిందంటే
సోషల్ మీడియాలో వార్తలపై హైడ్రా కమిషనర్ గుస్సా
Read Latest Telangana News And Telugu News