BIG BREAKING: కవితకు బీఆర్ఎస్ కౌంటర్..!
ABN , Publish Date - Sep 01 , 2025 | 05:51 PM
ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంత దుమారం రేపుతున్నా్యి. ఈ నేపథ్యంలో కవిత కామెంట్స్‌పై బీఆర్ఎస్ స్పందించింది.
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై చేసిన సంచలన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. కవితకు కౌంటర్ ఇస్తూ.. BRS సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హరీష్‌రావును ఆరడుగుల బుల్లెట్ అంటూ ట్వీట్ చేసింది. కవిత కామెంట్స్ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌కు బీఆర్ఎస్ నేతలు క్యూ కట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసీఆర్‌తో కేటీఆర్, మధుసూదనాచారీ, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వరరరెడ్డి సమావేశమైనట్లు సమాచారం. అయితే తాజాగా.. బీఆర్ఎస్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ నుంచి కవిత పీఆర్వోను బీఆర్ఎస్ తొలగించింది.
ఇవి కూడా చదవండి:
భారత యుద్ధ నౌకలన్నీ స్వదేశంలోనే తయారవుతాయి: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
సెప్టెంబర్ నెలాఖరు కల్లా ఎయిర్ ఫోర్స్ చేతికి రెండు తేజస్ ఎమ్‌కే-1ఏ ఫైటర్ జెట్స్