Share News

BRS: స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. కేడర్‌ను సిద్ధం చేస్తున్న కేటీఆర్

ABN , Publish Date - Feb 08 , 2025 | 09:07 AM

BRS; స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ కార్యచరణను స్వీడప్ చేసింది. ఇందులో భాగంగానే నేతలు, కార్యకర్తలకు మాజీ మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.

BRS: స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. కేడర్‌ను సిద్ధం చేస్తున్న కేటీఆర్
BRS focus on Local Elections

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. లోకల్ బాడీ ఎన్నికలకు కేడర్‌ను గులాబీ పార్టీ సిద్ధం చేస్తోంది. ఇవాళ(శనివారం) ఉదయం 11గంటలకు తెలంగాణ భవన్‌లో వికారాబాద్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కేడర్‌కు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలని గులాబీ పార్టీ పట్టుదలతో ఉంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా బీఆర్ఎస్ ఉంది. ఈనేపథ్యంలో గ్రామాలను ప్రభావితం చేసే స్థానిక సంస్థల ఎన్నికలపై కారు పార్టీ దృష్టి సారించింది.


బీసీ కులగణనపై ఆందోళనకు సిద్ధమవుతున్నబీఆర్ఎస్

మాజీమంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశం రేపు(ఆదివారం) జరగనుంది. ఆదివారం ఉదయం 11గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం క్షేత్రస్థాయి కార్యాచరణకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది. బీసీ కులగణన ద్వారా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ద్రోహం చేసిందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున కార్యచరణ ప్రకటించే అవకాశం ఉంది. బీసీలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఆందోళనకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

MP Anil: మూసీ పునర్జీవంపై పార్లమెంట్‌లో ప్రస్తావన..

Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్‌.. టెన్షన్‌..

Nalgonda Cat Fight: ఆ పిల్లి నాది.. కాదు నాది!

Read Latest Telangana News and Telugu News

Updated Date - Feb 08 , 2025 | 09:19 AM