Share News

BJP Ramchander Rao: నేడు కామారెడ్డిలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పర్యటన..

ABN , Publish Date - Aug 29 , 2025 | 10:10 AM

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం రామచందర్ రావు కామారెడ్డికి వెళ్లనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులకు బీజేపీ అండగా ఉండనుందని భరోసా ఇవ్వనున్నారు.

BJP Ramchander Rao: నేడు కామారెడ్డిలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పర్యటన..

కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాలు అస్తవ్యస్తం అయ్యాయి. ఎన్నడూ.. లేని విధంగా కామారెడ్డి జిల్లాలు 36.8 సెం.మీల వర్షపాతం నమోదు అయిన విషయం తెలిసిందే. జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రెండు రోజుల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా.. కామారెడ్డి పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వంతెనలు కూలాయి. కల్వర్టులు కొట్టుకుపోయాయి. వాగులు పొంగాయి. ఊళ్లకు ఊళ్లే జలదిగ్బంధమయ్యాయి. రహదారులు ధ్వంసమై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో గంటలకొద్దీ ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. పదుల సంఖ్యలో గ్రామాల్లో విద్యుత్‌ నిలిచిపోయి అంధకారం అలముకుంది. ఈ నేపథ్యంలో పట్టణంలోని ముంపు ప్రాంతాలలో ఇవాళ(శుక్రవారం) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు పర్యటించనున్నారు.


బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం రామచందర్ రావు కామారెడ్డికి వెళ్లనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులకు బీజేపీ అండగా ఉండనుందని భరోసా ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వరద ప్రభావిత ప్రాంతాలను ఆదుకోవాలని తెలియజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే.. ఇప్పటికే కామారెడ్డిలో నెలకొన్న ఇబ్బందులను ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, రామచందర్ రావుకు వివరించినట్లు సమాచారం. కాగా, నిన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

వైఎస్ జగన్ చ‌ట్టం ముందు దోషిగా నిల‌బడక త‌ప్పదు..

ఏపీ ప్రభుత్వ స్టీల్‌ను దోచిన ఘనులు.. భారీ స్కాం వెలుగులోకి...

Updated Date - Aug 29 , 2025 | 10:11 AM