Share News

MP Dharmapuri Arvind: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీజేపీలో కీలక పరిణామం.. అభ్యర్థి ప్రతిపాదన

ABN , Publish Date - Oct 09 , 2025 | 07:43 PM

సీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేపై అర్వింద్ స్పందించారు. బీసీలపై సీఎం రేవంత్‌ది కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. బీసీల ఆత్మగౌరవంతో రేవంత్‌ ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

MP Dharmapuri Arvind: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీజేపీలో కీలక పరిణామం.. అభ్యర్థి ప్రతిపాదన
MP Arvind

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక అభ్యర్థిపై బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ నేత బొంతు రామ్మోహన్‌ పేరును తెలంగాణ బీజేపీ చీఫ్‌ రామచందర్‌ రావుకు ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ప్రతిపాదించారు. బొంతు రామ్మోహన్‌ను పార్టీలోకి తీసుకుని జూబ్లీహిల్స్‌ టికెట్‌ ఇవ్వాలని.. ఆయన కోరారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల మేనేజ్‌మెంట్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. బొంతు రామ్మోహన్‌కు ABVP బ్యాక్‌గ్రౌండ్‌ ఉందని ఎంపీ అర్వింద్‌ స్పష్టం చేశారు.


అనంతరం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేపై అర్వింద్ స్పందించారు. బీసీలపై సీఎం రేవంత్‌ కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. బీసీల ఆత్మగౌరవంతో రేవంత్‌ ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ సవరణ చేయకుండా బిల్లు ఉంటుందా..? అర్వింద్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర సంస్థ ఇంచార్జ్ చంద్రశేఖర్ తివారి, ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కుప్పకూలిన పోలీస్ అధికారి.. అసలేమైందంటే..

రైతులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.5000 పెన్షన్..

Updated Date - Oct 09 , 2025 | 07:44 PM