Share News

Pochampally Farmhouse: పోచంపల్లి ఫామ్‌హౌస్ కోడిపందాల కేసులో బిగ్ ట్విస్ట్

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:00 PM

Pochampally Farmhouse: మొయినాబాద్‌లో కోడిపందాలు నిర్వహించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసులు సోదాలు చేస్తుండగా పలువురు జూదరులు అక్కడి నుంచి పారిపోయారు. పారిపోతున్న వారిలో ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసును పోలీసులు వేగంగా విచారణ జరుపుతున్నారు.

Pochampally Farmhouse: పోచంపల్లి ఫామ్‌హౌస్ కోడిపందాల కేసులో బిగ్ ట్విస్ట్
Moinabad Farmhouse

హైదరాబాద్: పోచంపల్లి ఫామ్‌హౌస్ కోడిపందాల కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. గత రెండు సంవత్సరాలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (MLC Pochampally Srinivas Reddy) ఫామ్‌హౌస్‌లో నిత్యం కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు సంవత్సరాల్లో ఈ పందాల ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా నిర్వహించిన కోడిపందాల సమాచారం తెలుసుకొని పోలీసులు దాడి చేశారు. పోలీసుల రాకతో అక్కడి నుంచి పలువురు జూదరులు పారిపోయారు. పారిపోయిన వారిలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మేనల్లుడు జ్ఞానదేవ్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. జ్ఞానదేవ్ రెడ్డితో పాటు మరి కొంతమంది ప్రముఖులు పారిపోయారు. సుమారు రూ.40 లక్షల నగదును వారు పారిపోతూ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. జ్ఞానదేవరెడ్డితో పాటు మిగతా వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.


పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు...

కాగా, కోడిపందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు(Moinabad Police) నిన్న (గురువారం) నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కోడి పందాలు జరిగిన ఫాంహౌస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందినదిగా పోలీసులు నోటీసుల్లో తెలిపారు. మొయినాబాద్ తోల్కట్ట గ్రామం సర్వే నెంబర్ 165/aలో ఈ ఫార్మ్ హౌస్ ఉందని పోలీసులు గుర్తించారు. నాలుగు రోజుల్లో ఆధారాలతో తమ ముందు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా మొయినాబాద్ పోలీసులు నమోదు చేశారు. సెక్షన్ 3 అండ్ 4 గేమింగ్ యాక్ట్ కింద్ కేసు నమోదైంది. సెక్షన్ 11 యానిమల్ యాక్ట్ కింద మరో కేసును పోలీసులు నమోదు చేశారు. ఫార్మ్ హౌస్‌లో బెట్టింగ్స్ చేస్తూ పందాలు ఆడిస్తున్నట్లు మొయినాబాద్ పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డి ఫార్మ్‌హౌస్‌ను సబ్ లీజుకు భూపతి రాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ తీసుకున్నారు. ఫార్మ్‌హౌస్‌లో భారీ సెటప్‌తో కోడి పందాలను గబ్బర్ నిర్వహించాడు. అయితే కోడిపందాలకు సంబంధించి మరి కొంతమందిని విచారించే అవకాశాలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రమాణాలు పాటించకుండా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఆహార పదార్థాలు!

సంజయ్‌, కిషన్‌రెడ్డి.. కోతల రాయుళ్లు

ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్‌ ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలి

Mini Jatara.. మేడారంలో కొనసాగుతున్న మినీజాతర

Read Latest Telangana News and Telugu News

Updated Date - Feb 14 , 2025 | 01:22 PM