Share News

Earbuds Side Effects: రోజూ ఇయర్‌బడ్స్ వాడితే ఏమవుతుందో తెలుసా?

ABN , Publish Date - Aug 25 , 2025 | 04:02 PM

బెటర్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఇటీవల ప్రతిఒక్కరూ స్మార్ట్ ఫోన్లతో పాటే ఇయర్‌బడ్స్ కూడా క్రమం తప్పకుండా వాడుతున్నారు. రోజులో తమకు తెలియకుండానే గంటల తరబడి వినియోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా చెవులపై తీవ్ర దుష్ప్రభావాలు పడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు తప్పవని..

Earbuds Side Effects: రోజూ ఇయర్‌బడ్స్ వాడితే ఏమవుతుందో తెలుసా?
Side Effects of Using Earbuds

ఇయర్ ఫోన్లు, ఇయర్ బడ్స్ ఇప్పుడు మన జీవితంలో భాగమయ్యాయి. ఫోన్లతో ఎక్కువ సమయం గడిపే యువతతో సహా చాలా మంది వాటిని చెవుల్లో తప్పనిసరిగా నిత్యం పెట్టుకునే ఉంటున్నారు. బస్సులో ఉన్నా.. బైక్ నడుపుతున్నా.. రోడ్డు దాటుతున్నా.. ఫోన్‌లో మాట్లాడుతున్నా.. భోజనం చేస్తున్నా లేదా బోర్ కొట్టినా కొందరికి చెవుల్లో 'ఇయర్‌బడ్స్' ఉండి తీరాల్సిందే. బరువు తక్కువగా ఉండటం, వాడుకలో సౌలభ్యం, చెవులకు అతికిన్లు సెట్ అయ్యేలా ఉండటం, స్టైలిష్ గా కనిపించడం వల్ల అవి మరింత ప్రాచుర్యం పొందుతున్నాయి. కానీ, వీటిని ఒకసారి చెవుల్లో పెట్టుకుంటే చుట్టూ ఉండే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. ముఖ్యంగా యువతలో ఈ అలవాటు ప్రబలంగా ఉంది. కానీ, ఇది అనేక సమస్యలకు కారణమవుతోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


ఇయర్ బడ్స్ పెట్టుకుని బైక్‌లపై వేగంగా వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పక్కనుంచి వచ్చే వాహనాల హారన్ శబ్దాన్ని గమనించుకోలేక కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అంతేగాక, చెవులకు సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ఇయర్‌బడ్‌ల అధిక వాడకాన్ని నివారించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


వినికిడి లోపం

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల ప్రపంచవ్యాప్తంగా 12 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల 1 బిలియన్ మంది ప్రజలు వినికిడి లోపం బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్‌లు పెట్టుకుని పాటలు లేదా ఇతర వాటిని అధిక వాల్యూమ్‌లో వినడం వల్ల వినికిడి లోపం వచ్చే ఛాన్స్ ఉంది. ఇయర్‌ఫోన్‌లను తరచుగా ధరించడం వల్ల చెవి లోపల తేమ పేరుకుపోయి బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఇన్ఫెక్షన్, వాపు వచ్చే ప్రమాదం ఉంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటుంది. హెడ్‌ఫోన్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల వినికిడి వ్యవస్థ దెబ్బతింటుందని శాశ్వత వినికిడి లోపం సంభవిస్తుందని ఈజిప్షియన్ జర్నల్ ఆఫ్ ఓటోలారిన్జాలజీ ఒక నివేదికను ప్రచురించింది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు.

అధిక వాల్యూమ్ ప్రభావాలు

85 డెసిబుల్స్ కంటే ఎక్కువ ధ్వనిని వినడం వల్ల శాశ్వత వినికిడి సమస్యలు వస్తాయి. ప్రస్తుతం యువత అధిక వాల్యూమ్‌లో పాటలు వింటున్నారని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. చెవి సమస్యలను నివారించడానికి 60-60 నియమం కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అంటే, రోజుకు 60 నిమిషాల పాటు వాల్యూమ్ గరిష్ఠంగా 60 శాతానికి మించకూడదు. ఇయర్‌బడ్‌లలో గంటసేపు పాటలు వినడానికి బదులుగా, ప్రతి 10-15 నిమిషాలకు విరామం తీసుకోవాలి. మీరు హై వాల్యూమ్‌లో 50 నుండి 60 శాతం వింటే రోజులో ఎక్కువ సమయం సురక్షితంగా సంగీతాన్ని వినవచ్చని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ అధ్యయనం సూచిస్తుంది.


యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేయకపోతే

ఇయర్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్‌లు ధ్వనిని నేరుగా చెవిపోటుకు అందిస్తాయి. హెడ్‌ఫోన్‌లు తక్కువ పరిధిని కలిగి ఉంటాయి. మీరు ఇయర్‌బడ్‌లను ఉపయోగిస్తుంటే వాటికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఉందని నిర్ధారించుకోండి. హెడ్‌ఫోన్‌ల ద్వారా బయటి శబ్దాన్ని వినలేరు కాబట్టి వాల్యూమ్‌ను ఎక్కువగా పెంచకూడదు. బస్సులు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు, ట్రాఫిక్‌లో ANCని ఆఫ్ చేసేటప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించమని నిపుణులు సలహా ఇస్తున్నారు.

చెవిలో నరాలు బలహీనపడటం

ఇయర్‌బడ్‌లు ఎక్కువగా వాడితే విద్యుదయస్కాంత తరంగాల కారణంగా చెవిలోని నరాలు బలహీనపడే ప్రమాదం ఉంది. వినికిడి సమస్యలు క్రమంగా తలెత్తుతాయి. అది మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అధిక వాల్యూమ్‌లో పాటలు వినడం వల్ల చెవిలోని బ్యాలెన్స్ ఆర్గాన్ దెబ్బతింటుంది. దీనివల్ల దీర్ఘకాలంలో తలతిరగడం, తలనొప్పి, వాంతులు, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

ఇవి కూడా చదవండి:

లాప్‌టాప్‌ను క్లీన్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
స్మార్ట్ ఫోన్‌లో సీక్రెట్ సెట్టింగ్స్.. వీటిని సరిగ్గా వాడుకుంటే..

Read Latest and Technology News

Updated Date - Aug 25 , 2025 | 04:03 PM