Share News

Laptop Cleaning Guide: లాప్‌టాప్‌ను క్లీన్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:01 PM

లాప్‌టాప్‌లను శుభ్రపరిచే విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న ఖరీదైన వస్తువు పాడయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి లాప్‌టాప్ క్లీనింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Laptop Cleaning Guide: లాప్‌టాప్‌ను క్లీన్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Laptop Cleaning Tips

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం లాప్‌టాప్ దాదాపుగా అందరి వద్దా ఉంటోంది. చదువు, ఉద్యోగం, ఎంటర్‌టెయిన్‌మెంట్.. ఇలా రకరకాల అవసరాల కోసం లాప్‌టాప్ వినియోగం పెరిగిపోయింది. కానీ కాలం గడిచేకొద్దీ లాప్‌టాప్‌పై దుమ్ముధూళీ చేరడం పక్కా. ఇది చివరకు లాప్‌టాప్ పనితీరుపైనా ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో లాప్‌టాప్‌ను శుభ్రపరిచేందుకు అనేక మంది ఇంట్లో సాధారణంగా వాడే వస్తువులను వినియోగిస్తుంటారు. ఇలాంటి పనుల వల్ల లాప్‌టాప్ పాడయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి లాప్‌టాప్‌ను శుభ్రపరిచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

లాప్‌టాప్‌ను షట్‌డౌన్ చేశాకే శుభ్రపరచాలి. చార్జర్‌, ఇతర ఎక్స్‌టర్నల్ డివైజ్‌లను తీసేయాలి. రిమూవబుల్ బ్యాటరీ ఉన్నట్టైతే దాన్ని కూడా తొలగించాకే శుభ్రం చేయాలి. ఈ జాగ్రత్తలతో విద్యుదాఘాతం ముప్పు తొలగిపోతుంది.

లాప్‌టాప్‌ను క్లీన్ చేసేందుకు సాధారణ వస్త్రాలు కాకుండా మైక్రోఫైబర్ క్లాత్‌నే వినియోగించాలి. అత్యంత మృదువుగా ఉండే లింట్ ఫ్రీ రకాలను ఎంచుకోవాలి. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ (70%), కంప్రెస్డ్ ఎయిర్, కాటన్ స్వాబ్స్, మెత్తని బ్రష్ రెడీ చేసుకోవాలి.


ఆల్కహాల్‌ను నేరుగా స్క్రీన్‌పై అస్సలు స్ప్రే చేయకూడదు. నీరు, ఐపోప్రొపైల్ ఆల్కహాల్‌ను సమపాళ్లల్లో కలిపి, మైక్రోఫైబర్ క్లాత్‌ను ఈ మిశ్రమంతో తడపాలి. ఆ తరువాత క్లాత్‌తోనే స్క్రీన్‌ను శుభ్రం చేయాలి. చాలా నెమ్మదిగా మైక్రోఫైబర్ క్లాత్‌తో స్క్రీన్‌ను తుడవాలి. స్క్రీన్‌పై గట్టిగా ఒత్తితే అది దెబ్బతింటుందన్న విషయం మర్చిపోకూడదు. అమోనియా ఉండే సాధారణ గ్లాస్ క్లీనర్స్‌ను అస్సలు వాడకూడదు.

లాప్‌టాప్‌ను ఏటవాలుగా పట్టుకుని కంప్రెస్డ్ గాలి దానిపై కొడుతూ కీబోర్డు, టచ్‌ప్యాడ్‌ను శుభ్రపరచాలి. ఆల్కహాల్‌తో తడి చేసిన కాటన్ స్వాబ్స్ లేదా మైక్రోఫైబర్ క్లాత్‌తో కూడా శుభ్రం చేయొచ్చు.

ఇక లాప్‌టాప్‌లోని పోర్ట్స్, వెంట్స్‌పై కంప్రెస్డ్ ఎయిర్‌ కొట్టి దుమ్ముదులపాలి. అవసరమనుకుంటే మెత్తని బ్రష్‌ను కూడా ఉపయోగించొచ్చు.

కీబోర్డు, టచ్‌ప్యాడ్ వంటివాటిపై తరచూ చేతులు పెట్టడం వల్ల అవి జిడ్డుగా మారతాయి. కాబట్టి ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌లో తడి చేసిన మైక్రోఫైబర్ క్లాత్‌తో వీటిని శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

శుభ్రం చేయడం పూర్తయ్యాక లాప్‌టాప్‌ను కాసేపు ఆరనివ్వాలి. తడి మొత్తం పూర్తిగా ఆరిపోయాకే లాప్‌టా‌ప్‌‌‌ను ఆన్ చేయాలి. లాప్‌టాప్ అపరిశుభ్రంగా మారకుండా ఉండేందుకు ప్రతి రెండు వారాలకు ఒకసారి శుభ్రం చేయాలని నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

భారతీయులకు ఓపెన్ ఏఐ బంపర్ ఆఫర్.. కేవలం రూ.399లకే..

స్మార్ట్ ఫోన్‌లో సీక్రెట్ సెట్టింగ్స్.. వీటిని సరిగ్గా వాడుకుంటే..

Read Latest and Technology News

Updated Date - Aug 25 , 2025 | 12:06 PM